హోటల్ బిల్ చూసి పరార్ అయిన ప్రియుడు.. అసలు విషయమేమిటంటే..?!

ప్రేమించుకున్న వారు బయట తిరగడం, షికార్లు చేయడం, పార్టీలకు వెళ్లడం లాంటివి విషయాలు సర్వసాధారణమే.అయితే తాజాగా ఓ వ్యక్తి తన ప్రియురాలిని డేటింగ్ కు తీసుకు వెళ్లాలని సరదా పడ్డాడు.

 Boy Friend, Girl Friend, Lovers, Hotel Bill, Chaina, Online Friendship, 19800 Un-TeluguStop.com

అయితే ప్రియురాలు డేటింగ్ కు ఒకటే రాకుండా తనతో పాటు ఏకంగా 23 మంది స్నేహితులను కూడా తీసుకు వెళ్ళింది.ఇంకేముంది వాళ్ళందరిని చూసి ఆ ప్రేమికుడి గుండె ఆగినంత పని అయిపోయింది పాపం.

వాళ్ల అందరితో కలిసి భోజనం చేసిన తర్వాత వెయిటర్ తీసుకు వచ్చిన బిల్లు చూసి ఆ ప్రేమికుడు అక్కడినుంచి చిన్నగా జారుకున్నాడు.అయితే ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

చైనా దేశంలోని జోజియాంగ్ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువతీ యువకులు ఆన్లైన్లో పరిచయాలు పెంచుకొని ఆ తర్వాత వారిద్దరి మధ్య స్నేహం బలపడడంతో.వారి స్నేహాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్దామని భావించిన వారు డేటింగ్ కి వెళ్దామని అనుకున్నారు.

అందుకోసం ఓ భారీ ప్లాన్ కూడా వేసుకున్నారు.ఓ రెస్టారెంట్ కి వెళ్లి అక్కడ వారిద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవాలి అని అనుకున్నారు.

ఇందులో భాగంగానే ఆ యువకుడు అనుకున్న రెస్టారెంట్ కు చేరుకున్నాడు.తన ప్రేయసి కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న అతడు ఇంతలో అతని ప్రేయసి ఏకంగా 23 మంది స్నేహితులను తీసుకొని వచ్చింది.

దీంతో ఆ యువకుడు ఏం చేయాలో అర్థం కాక వారు అందరితో కబుర్లు చెప్పుకుంటూ భారీగా విందు ఆరగించారు.ఇక ఇప్పుడే అసలైన సంగతి మొదలైంది.

వారు తిన్న ఫుడ్ కి ఆ ఆ హోటల్ వెయిటర్ బిల్లు తీసుకొని రాగా ఆ బిల్ చూసి అక్కడి నుంచి అతడు జారుకున్నాడు.తన ప్రియురాలు వారి బ్యాచ్ మొత్తం తిన్న ఆహారానికి ఏకంగా 19800 యునాన్లు.

అంటే మన భారత కరెన్సీలో ఏకంగా 2 లక్షల 17వేల బిల్లును తీసుకోచ్చాడు.ఇక అంతే ఆ బిల్లు చూడగానే ఆ యువకునికి కళ్ళు తిరిగినంత పని కావడంతో చుట్టుపక్కల ఉన్న ఎవరిని పట్టించుకోకుండా అక్కడ నుంచి జారుకున్నాడు ఆ యువకుడు.

ఈ సందర్భంగా సదరు ప్రేమికురాలు మాట్లాడుతూ.తన ప్రియుడు తొలిసారిగా తనను కలుసుకునేందుకు బ్లైండ్ డేట్ కు ప్లాన్ చేసుకున్నామని.అయితే తాను 23 మందిని వెంటేసుకొని రెస్టారెంట్ కి వెళ్లానని అయితే తామంతా తిన్నాక అతను ఆ బిల్లును చూసి ఆ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు అని చెప్పుకొచ్చింది.దీంతో తాము తిన్న ఆహారానికి తామే పూర్తిగా బిల్లులు చెల్లించి ఆ రెస్టారెంటు నుంచి బయటపడ్డామని చెప్పుకొచ్చింది.

అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.ఆ యువతి ఆ యువకుని పై పోలీస్ కేస్ పెట్టడమే.

ఇలా పోలీస్ కేస్ పెట్టడంతో ఆ యువకుడు చేసేది ఏమీ లేక తన స్థాయికి తగ్గట్టుగా కేవలం కొద్ది మొత్తాన్ని చెల్లించేందుకు ముందుకు వచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube