నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘వి’ భారీ అంచనాల నడుమ ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని నాని చేసిన ప్రయత్నం కొంతమేర ఫలించిందని చెప్పాలి.
రిలీజ్‌కు ముందే ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సె్స్ కావడంతో, ఈ సినిమాను మెజారిటీ శాతం ప్రేక్షకులు వీక్షించేందుకు ఆసక్తి చూపారు.కానీ సినిమాలో అనుకున్న స్థాయిలో కంటెంట్ లేకపోవడంతో ఈ సినిమా ఓటీటీలో యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాత దిల్ రాజుకు పెద్ద మొత్తం ముట్టిందనే టాక్ వినిపించింది.
ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత దిల్ రాజుకు లాభాలను తెచ్చిపెడుతోంది.ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా రిలీజ్ చేసినందుకు ఏకంగా రూ.31 కోట్ల భారీ డీల్ కుదుర్చుకున్న దిల్ రాజు, ఇప్పుడు ఈ సినిమా డబ్బింగ్, శాటిలైట్ రైట్స్ రూపంలో లాభాలను అందుకుంటున్నాడు.ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ ఏకంగా రూ.8 కోట్లకు అమ్ముడుకాగా, తాజాగా ఈ చిత్రం శాటిలైట్ రైట్స్‌ను రూ.8 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది.ఈ లెక్కన దిల్ రాజు ‘వి’ చిత్రం ద్వారా రూ.15 కోట్ల లాభం పొందినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.థియేటర్లు లేకపోయినా, తనదైన మాస్టర్ ప్లాన్‌తో ఈ సినిమాను దిల్ రాజు డీల్ చేసిన విధానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మొత్తానికి నాని ‘వి’చిత్రం నిజంగానే విచిత్రంగా మారింది.థియేటర్లు లేవు, ప్రేక్షకులు క్యూలో నిల్చునే పరిస్థితి లేకపోయినా ఈ సినిమా అందుకున్న లాభాలను చూసి ఇతర దర్శకనిర్మాతలు అవాక్కవతున్నారు.
ఏదేమైనా దిల్ రాజు మాస్టర్‌మైండ్‌కు వారు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.ఇక నాని హీరోగా నటించిన ఈ సినిమాలో సుధీర్ బాబు మరో హీరోగా నటించాడు.దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నివేదా థామస్, అదితిరావు హైదరీలు హీరోయిన్లుగా నటించారు.