స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించే ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా మారుతుండటంతో ఆయన సినిమాలను ప్రేక్షకులు పెద్ద ఎత్తున చూస్తున్నారు.ఇక బన్నీ చేసిన సినిమాలను కేవలం తెలుగు ఆడియెన్స్ మాత్రమే కాకుండా ఇతర భాషల అభిమానులు కూడా ఆదరిస్తుంటారు.
ఇక బన్నీ చేసిన చిత్రాలను హిందీలో డబ్బింగ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తుంటారు.బాలీవుడ్ జనాలు ఈ సినిమాలకు ఫుల్ ఫిదా అవుతుండటంతో బన్నీకి అక్కడ కూడా అదిరిపోయే క్రేజ్ ఏర్పడింది.
ఇక బన్నీ హిందీ డబ్ సినిమాలకు రికార్డు స్థాయిలో వ్యూవర్‌షిప్ వస్తుంది.ఇప్పటికే సరైనోడు చిత్రం అదిరిపోయే రికార్డును తన సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే మిగతా ఏ తెలుగు హీరో కూడా బన్నీని ఈ విషయంలో టార్గెట్ చేయలేకపోతున్నారు.కానీ ఓ యంగ్ తెలుగు హీరో మాత్రం బన్నీకి పోటీగా దూసుకుపోతున్నాడు.
యాక్షన్‌కు కేరాఫ్‌గా మారిన బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన జయ జానకీ నాయక చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది.ఇదే సినిమాను హిందీలో డబ్ చేసి వదిలితే, దానికి స్టన్నింగ్ రెస్పాన్స్ వచ్చింది.
ఇటీవల ఈ సినిమా ఏకంగా 300 మిలియన్ వ్యూవర్‌షిప్ మార్క్‌ను దాటింది.ఈ మార్క్‌ను టచ్ చేసిన రెండో ఇండియన్ సినిమాగా ఇది నిలిచింది.
ఫస్ట్ సినిమాగా బన్నీ నటించిన సరైనోడు ఒక్కటే ఇప్పటివరకు ఈ మార్క్‌ను అందుకుంది.దీంతో బన్నీకి బెల్లంకొండ బాబు బ్యాండ్ పెట్టేందుకు రెడీ అవుతున్నాడంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు.
యాక్షన్‌తో రెచ్చిపోయే బెల్లంకొండ బాబు, ప్రస్తుతం అల్లుడు అదుర్స్ అనే సినిమాలో నటిస్తోన్నాడు.మరి ఈ హీరో నిజంగానే బన్నీకి పోటీ ఇస్తాడా అనేది చూడాల్సి ఉంది.