లక్ష్యం మంచిది అయితే వయసు అనేది అడ్డురాదు అన్న విషయం ఈ బామ్మను చూస్తే అర్ధం అవుతుంది.చదువుకోవాలన్న లక్ష్యం తో ముందుకు సాగుతున్న ఈ బామ్మ వయసు 104 సంవత్సరాలు.
ఇంత వయస్సు ఉన్న ఈ బామ్మ ఇప్పుడు 4 వ తరగతి చదవడానికి సిద్దపడింది.కేరళకు చెందిన ఈ బామ్మ మహిళా అక్షరాస్యత మిషన్ నిర్వహించిన నాలుగవ తరగతి పరీక్షకు హాజరయ్యి అందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ బామ్మా పేరు భగీరథి అమ్మ, అయితే చిన్నప్పుడే తన తల్లి చనిపోవడం, తోబుట్టువులను చూసుకోవల్సిన బాధ్యత తనపై ఉండటంతో చిన్నప్పుడు చదవడం కుదరలేదని, ఆ తరువాత పెళ్లి భాద్యతలు, చిన్న వయసు లోనే భర్త కోల్పోవడం వంటి ఘటనలతో ఆమె బాధ్యతలు పెరిగిపోయాయి.30 ఏళ్లలోనే భర్తను కోల్పోవడం తో తన ఆరుగురు పిల్లల భాద్యత ఈమె పై పడడం తో చదువుకోవాలని ఆశ ఉన్నప్పటికీ చదువుకోలేకపోయిందట.అయితే ఇప్పుడు ఈ 104 ఏళ్లు నిండిన ఈ బామ్మా తన చిన్నప్పటి ఆశ తీర్చుకోవాలని ఇలా ఈ బామ్మా మహిళా అక్షరాస్యత మిషన్ ద్వారా 4 వ తరగతి పరీక్షలు రాయడానికి హాజరైంది.

ఈ వయసులో కూడా బామ్మకు అద్భుతమైన జ్ఞాపకశక్తి, పదునైన కంటిచూపు ఉన్నందున ఈ పరిక్ష రాయడం కుదిరిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.ఎప్పుడో తన 9వ సంవత్సరంలో మూడవ తరగతి వరకూ చదివివ ఈ బామ్మ ఇఫ్పుడు 105వ ఏట నాలుగవ తరగతి చదవం చాలా సంతోషంగా ఉందని చెబుతుంది.అయితే ప్రస్తుతం ఈ బామ్మకు ఆధార్ కార్డు కూడా లేకపోవడం తో ఆమెకు వితంతువు ఫించను గానీ,వృద్ధాప్య ఫించన్ గానీ ఏమి లభించడం లేదట.