చిన్ననాటి నుంచీ ప్రేమించుకున్న వారి ప్రేమ నిజమయ్యే సమయానికి చెల్లాచెదురు అయ్యింది.ఎన్నో ఏళ్ళుగా పెళ్లి చేసుకోవాలని తపన పడుతూ చివరికి పెళ్లి చేసుకుని నిమిషాలు కూడా గడవక ముందే మృత్యువు కబళించింది.
ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.వివరాలలోకి వెళ్తే.
చిన్నతనం నుంచీ ఆ యువతీ యువకుడు ప్రేమించుకున్నారు.ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి.
దాంతో పెద్దలని ఒప్పించి మరీ అతి కష్టం మీదట తమ ఏళ్ళ నాటి ప్రేమని చర్చిలో జరుపుకున్నారు.

ఇంకా తమని ఎవరూ విడదీయలేరు అంటూ ఒకరిని ఒకరు హత్తుకున్నారు.వారి ఇరువురు కుటుంభాలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశాయి.అందరూ రిసెప్షన్ హాల్ కి బయలు దేరారు.
కొత్త దంపతుల కోసం సిద్దం చేసిన కారులో ఇద్దరూ కూర్చున్నారు.వరుడు డ్రైవ్ చేస్తుండగా , వధువు పక్కనే కూర్చుని అతడినే చూస్తూ కలలు నిజమైనందుకు సంతోషం వ్యక్తం చేస్తోంది.
ఈలోగా ఈ సంతోషాన్ని మృత్యువు కబళించింది.ఒక్క సారిగా రోడ్డు ఎక్కినా వారి కారుని అటుగా వస్తున్నా ట్రక్కు డీ కొట్టింది.

గాలిలో పైకి లేచిన కారు పల్టీలు కొడుతూ , ఎంతో దూరం వెళ్ళిపోయి నుజ్జు నుజ్జు అయ్యిపోయింది.పెళ్లి చేసుకుని గంటలు కూడా కాలేదు, తమ చిన్న నాటి ప్రేమని కనీసం ఒక్క రోజు కూడా ఆస్వాదించలేదు ఆ జంట చివరికి ఈ ప్రమాదంలో ప్రాణాలు విడిచారు.ఈ ఘటనతో ఒక్క సారిగా వెదుకకీ వచ్చిన వారందరూ కన్నీరు మున్నీరు అయ్యారు.తీవ్ర భావోద్వేగాలు అక్కడ ఉన్న వారందరినీ ఆవహించాయి.ఈ కేసుని పోలీసులు ఆక్సిడెంట్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.