చికాగో: ఆగస్ట్ 26: అమెరికాలో తెలుగువారిని ఒక్కటి చేసేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది.దీనిలో భాగంగానే చికాగోలో నాట్స్ నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ కు చక్కటి స్పందన లభించింది.15 టీంలు, 22 మ్యాచ్ లతో ఈ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది.దాదాపు 200 మంది క్రికెట్ ప్లేయర్లు ఈ టోర్నమెంట్ లో తమ టాలెంట్ చూపించారు.
రేజింగ్ బుల్స్ టీం ఈ చికాగో క్రికెట్ టోర్నమెంట్ కప్ 2019 ను కైవసం చేసుకుంది.
చికాగో నాట్స్ నాయకులైన మహేశ్ కాకర్ల, మూర్తి కొప్పాక, శ్రీనివాస పిడికిటి, రాజేశ్ వీదులమూడి, కృష్ణ నిమ్మగడ్డ, శ్రీనివాస బొప్పన, శ్రీథర్ ముమ్మనగండి,కృష్ణ నున్న, ఆర్కే బాలినేని, హారీశ్ జమ్ముల, కార్తీక్ మోదుకూరి, శ్రీనివాస్ పిల్ల తదితరులు ఈ టోర్నమెంట్ విజయవంతానికి సమర్థమైన నాయకత్వాన్ని అందించారు.
యజ్ఞేష్, అరుల్ బాబు, సందీప్ వెల్లంపల్లి, అరవింద్ కోగంటి, కృష్ణ నిమ్మగడ్డ, సంతోష్ పిండి, వినోద్ బాలగురు చక్కటి ప్రణాళికతో ఈ టోర్నమెంట్ విజయంలో కీలక పాత్ర పోషించారు.ప్రశాంత్ నున్న, వెంకట్ దాములూరి, గోపాల్ శీలం, మురళీ కోగంటి, శ్రీకాంత్ బొజ్జా, వేణు కృష్ణార్ధుల, చెన్నయ్య కంబాల, పాండు చెంగలశెట్టి, మనోహార్ పాములపాటి, నవాజ్ తదితరులు చక్కగా టోర్నమెంట్ నిర్వహణకు కృషి చేశారు.బావర్చి, హైదరాబాద్ హౌస్ లంచ్ స్పాన్సర్ చేసింది.శ్రీని అర్షద్ (Evolutyz), స్మార్ట్ డెక్, రవి శ్రీకాకుళం, విండ్ సిటీ వాసు అడ్డగడ్డ కార్పొరేట్ స్పాన్సర్లుగా వ్యవహారించారు.