అమెరికాలో ఓ మహిళ ఓ స్టోర్ నుంచీ పిల్లలకోసం ఉపయోగించే స్ట్రోలర్ కొట్టేయాలని పెద్ద పధకం వేసింది.తన స్నేహితులతో కలిసి స్థానికంగా ఉన్న న్యూజెర్సీ లోని స్టోర్ కి వెళ్ళింది.
తన స్నేహితులు అక్కడి షాప్ యజమానితో మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఉన్న స్ట్రోలర్ తీసుకుని ఉడాయించింది.తన స్నేహితులు కూడా మెల్లగా జారుకున్నారు.
అయితే ఈ దొంగతనం మొత్తంలో ట్విస్ట్ ఏమిటంటే.

పిల్లాదికోసం స్ట్రోలర్ కొట్టేసిన ఆమె తన పిల్లాడిని ఆ స్టోర్ లో వదిలేసి వచ్చేసింది.తీరా షాపులో పిల్లాడిని వదిలేశాను అని తెలుసుకున్న ఆమె మళ్ళీ షాపు వద్దకి వెళ్ళే సరికి షాపు ఓనర్ కాచుకుని కూర్చున్నాడు.ఆమె వచ్చీ రాగానే అడ్డుకున్న ఓనర్ పోలీసులకి సమాచారం అందించాడు.
దాంతో పోలీసులు ఆమెని, ఆమెతో పాటు ఆమె స్నేహితులని అరెస్ట్ చేశారు.
ఈ మొత్తం ఘటనకి సంభందించిన వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓనర్.
సూక్తి కొటేషన్ పోస్ట్ చేశాడు.బ్రతకడానికి దొంగతనం చేయడం తప్పు కానీ అది మీ వ్యక్తి గతం అంటూ చురకలు అంటించాడు.
అతడు పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే ఈ వీడియో వైరల్ అయ్యింది
.






