అరబిక్ దేశంలో లాటరీలు భాగా ఫేమస్.అలాగే అక్కడ లాటరీలలో ప్రతి సారి ఇండియాకి చెందిన వారు కోట్ల రూపాయిలు లాటరీ సొంతం చేసుకొని అదృష్టం తమ వెంట తెచ్చుకుంటారు.
ఇప్పటికే చాలా మంది భారతీయులు యూఏఈలో లాటరీలో కోట్ల రూపాయిలు సంపాదించి ఊహించని విధంగా కోటీశ్వరులు అయ్యారు.ఇదిలా ఉంటే తాజాగా ఓ భారతీయ మహిళ జాక్ పాట్ కొట్టింది.
ఆమెకు ఏకంగా 21 కోట్ల లాటరీ సొంతం చేసుకుంది.ఆమె కొనుగోలు చేసిన టికెట్‌కు జాక్ పాట్ తగిలినట్టు నిర్వాహకులు స్పష్టం చేయడంతో ఊహించని విధంగా అంత పెద్ద మొత్తంలో వచ్చిన డబ్బుకి ఆమె షాక్ అయ్యింది.
అయితే ఆ మొత్తం సొమ్ములో సగం ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్న మహిళల కోసం వినియోగించాలని ఆమె కోరుకుంటున్నట్టు లాటరీ సంస్థ తెలిపింది.
కేరళలోకి కొల్లంకు చెందిన సప్న నాయర్ అనే మహిళకు అబుదాబిలోని ఓ కన్సల్టెన్సీలో సీనియర్ స్ట్రక్చరల్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తుంది.
తనకి రెగ్యులర్‌గా లాటరీ టికెట్లు కొనే వ్యక్తిని కాదని, అయితే తన భర్తకి తెలియకుండా ఏదో సరదా కోసం ఇలా లాటరీ టికెట్ కొనుగోలు చేసినట్టు తెలిపింది అయితే, లాటరీ గెలిచానని తెలిసిన తర్వాత మా ఆయన కూడా షాక్‌కు గురయ్యారని నాయర్ చెప్పుకొచ్చింది.ఈ క్రెడిట్ అంతా తన ఐదేళ్ల కుమార్తెకే దక్కుతుందని చెప్పింది.
తన కుమార్తె అదృష్టవంతురాలు కాబట్టి ఈ లాటరీ తగిలిందని చెప్పింది.అలాగే లాటరీ ద్వారా వచ్చే సొమ్ములో కొంత మొత్తం మహిళల కోసం ఉపయోగిస్తా అని నాయర్ ప్రకటించింది.