విడ్డూరం : ఈమెది రాక్షస ప్రేమ, ఇది చదివిన తర్వాత బాబోయ్‌ ఇంత ప్రేమ వద్దంటారు

ఒక వ్యక్తితో ప్రేమించబడటం అంటే చాలా అదృష్టం చేసుకుని ఉండాలి.ముఖ్యంగా ఒక మగాడు ఒక స్త్రీతో ప్రేమించబడటం అంటే నిజంగా అదో గొప్ప విషయం.

అతడి జీవితంలో అదో ముఖ్య ఘటంగా చెప్పుకోవాలి.అబ్బాయిల మనసు చెంచలంగా ఉన్నా అమ్మాయిలు మాత్రం ఎక్కువ శాతం ఒక్క మగాడినే ప్రేమిస్తారు.

అయితే వారు ప్రేమిస్తే ఎంత దూరం అయినా వచ్చేందుకు సిద్దంగా ఉంటారు.ప్రతి మగాడు అలాంటి ప్రేమను కోరుకుంటాడు.

కాని బ్రిటన్‌కు చెందిన జార్జ్‌ మాత్రం తనపై ఒక స్త్రీ చూపించిన ప్రేమను చచ్చి పోవాలనుకున్నాడు.ఆ ప్రేమను అతడు తట్టుకోలేక పోయాడు.

Advertisement

జార్జ్‌కు అప్పటికే పెళ్లి అయ్యింది.కొన్ని కారణాల వల్ల భార్య నుండి దూరంగా ఉన్నాడు.

ఆ సమయంలోనే అతడికి స్టెల్లా పరిచయం అయ్యింది.ఆ పరిచయంతో ఇద్దరి మద్య ప్రేమ ఏర్పడింది.

ఇద్దరు ఒకరంటే ఒకరు చాలా ప్రేమను చూపుకునే వారు.జార్జ్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని, అతడు అడగకుండానే అతడి కోరికలు తెలుసుకుని మరీ తీర్చేది.

జార్జ్‌ ఆమె ప్రేమ పట్ల ముగ్దుడు అయ్యాడు.ఆ సమయంలోనే జార్జ్‌ భార్య తన తప్పును తెలుసుకుని తిరిగి వచ్చింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఇద్దరు పిల్లల కోసం కలిసి ఉండాలని భావించాడు.

Advertisement

జార్జ్‌ సంతోషంకు స్టెల్లా అడ్డు చెప్పలేదు.భార్యతో కలిసి ఉంటేనే సంతోషంగా ఉంటావనుకుంటే వెళ్లు అంది.అయితే తనను మాత్రం మర్చిపోవద్దంది.

భార్యతో ఉంటూనే స్టెల్లాతో కూడా రిలేషన్‌ షిప్‌ మెయింటెన్‌ చేస్తూ వచ్చాడు.జార్జ్‌ కొన్ని కారణాల వల్ల స్టెల్లాను దూరం పెట్టడం మొదలు పెట్టింది.

దాంతో ఆమె రగిలి పోయింది.తనను దూరం పెడుతున్న జార్జ్‌పై కోపం అతడి కొడుకుపై చూపించింది.

స్కూల్‌కు వెళ్తున్న జార్జ్‌ కొడుకును కారుతో ఢీ కొట్టింది.ఆ పని తానే చేశాను అంది.

నీవు లేకుండా నేను ఉండలేను.నువ్వు ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా కూడా నా వద్దకు రావాల్సిందే.

ఎంత బిజీగా ఉన్నా రోజుకు ఒకసారి అయినా నాతో మాట్లాడాలి.నీవే జీవితంగా గడుపుతున్న నన్ను ఎలా దూరం పెడతావు అంటూ ఆమె హెచ్చరించింది.

విషయం చాలా సీరియస్‌ అవ్వడంతో ఆమె ప్రేమను భరించలేక జార్జ్‌ తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.బాబు ప్రాణాలతో మిగలడంతో ఆమెకు మరణ శిక్ష కాకుండా అయిదు సంవత్సరాల శిక్ష పడింది.

ఆమె ప్రేమను తట్టుకోలేక పోయాను అంటూ జార్జ్‌ అంటున్నాడు.

తాజా వార్తలు