ఇంట్లో ఏ గళమవుతూ బయట పల్లకిలో మాత అనే సామెతను ఎటువంటి సంకోచం లేకుండా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు క్రైస్తవ మత బోధకుడు డాక్టర్ కే ఏ పాల్ కు మనం ఆపాదించవచ్చు.ఆయన మాటలు మనకి కామెడీ గా అనిపించవచ్చు… మనం ఆయన్ని ఒక కామెడీ పంచె వ్యక్తిగానే చేస్తుండవచ్చు కానీ పాల్ కి మాత్రం ప్రపంచ దేశాల్లో బాగానే గుర్తింపు ఉంది .
అయితే గత ఎన్నికల సమయంలో ప్రజా సమితి పార్టీ అని పెట్టి ఎన్నికలకు వెళ్లి ఎక్కడ కూడా డిపాజిట్లు కూడా దక్కించుకోవాలని పార్టీగా గుర్తింపు పొందింది.ఏపీలో ఎన్నికల సమయం దగ్గరకు రావడంతో ఎక్కువగా ఆయన మీడియా చానల్స్ కాయక్రంలో పాల్గొంటూ తనదైన శైలిలో రాజకీయాల గురించి ఉపన్యాసాలు చేస్తున్నారు.
మీడియా కూడా ఎవరికీ ఇవ్వనంత స్థాయిలో ఆయనకు కవరేజ్ ప్రారంభించింది.ఒక్కసారిగా ఇలా పాల్ ఫామ్ లోకి… రావడం భారీ డైలాగులు చెప్పడం… ఇవన్నీ ఎవరో ఆయన్ను వెనకుండి నడిపిస్తున్నారని అనుమానం అందరిలోనూ కలుగుతోంది.అయితే ఆయన మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు… వైసీపీ అధినేత జగన్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు సవాళ్లు విసురుతున్నారు.తమ పార్టీతో పొత్తు కనుక పెట్టుకోకపోతే… మీకు గెలుపు సాధ్యం కాదంటూ శాపనార్ధాలు పెడుతున్నారు.
అంతేకాదు మొన్నా మధ్యన విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో వైసిపి తో విభేదించి… ఆ పార్టీకి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ ను తమ పార్టీలో చేరాలని పిలుపునిచ్చాడు.అలా చేరితే… అతడిని ఎమ్మెల్యే చేసి… ఆ తర్వాత తమ ప్రభుత్వంలో మంత్రిని కూడా చేస్తానంటూ ఒకవేళ గనుక మంత్రి పదవి ఇవ్వకపోతే మీ నాన్నగారు పేరు మీద నడుపుతున్న ట్రస్టుకు వంద కోట్ల రూపాయలు ఇస్తానంటూ.
ఆవేశంగా ప్రకటన విడుదల చేశారు.
అయితే ఈ ప్రకటనను వారు పెద్దగా పట్టించుకోలేదు కానీ అదో పెద్ద సంచలన వార్త అయింది.ఇక ఈ సమయంలో వెనక ఉండి నడిపిస్తుంది ఎవరు .? ఆయన్ను వెనకుండి నడిపిస్తుంది ఎవరు …? ఎందుకు ఆయన్ను ఇంతగా… హైలెట్ చేస్తున్నారు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు.అయితే పాల్ ను ఉపయోగించుకుని రాజకీయంగా లబ్ది పొందాలని ఏపీలో ఒక ప్రధాన పార్టీ చూస్తోందని… ఓ సామాజిక వర్గం ఓట్లను చీల్చడానికి … ఈ విధంగా పాల్ ను తెరమీదకు తెచ్చి కులాల గురించి మాట్లాడేలా ఆయనతో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే… టిడిపి అనుకూల మీడియా లుగా పేరు పడ్డ కొన్ని చానల్స్ మాత్రం ఆయనకు విపరీతమైన కవరేజ్ ఇస్తూ… ప్రమోట్ చేసే పనిలోపడ్డాయి.