తెలంగాణలో విజయం సాధించాలని బీజేపీ( BJP ) చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు.ఒకవైపు పార్టీని బలోపేతం చేస్తూనే మరోవైపు ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించే పనిలో ఉంది.
ఇక నేతలను ఆకర్శించేందుకు చేరికల కమిటీ చైర్మెన్ గా ఈటెల రాజేంద్రను( etela rajendra ) అధిష్టానం నియమించింది.అయితే ఆ పదవి చెప్పట్టిన మొదట్లో బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని, బిఆర్‌ఎస్( BRS ) మరియు కాంగ్రెస్ పార్టీలలోని కీలక నేతలు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని.
ఇలా చాలానే చెప్పుకొచ్చారు.ముఖ్యంగా బిఆర్‌ఎస్ పార్టీలోని చాలమంది నేతలతో ఈటెల రాజేంద్రకు మంచి సంబంధాలు ఉండడంతో ఆ పార్టీలోని నేతలను ఈటెల ఆకర్షించే అవకాశం ఉందని అధిష్టానం కూడా భావించింది.

అయితే ఇంతవరుకు బీజేపీలో చేరిన వారి సంఖ్య పెద్దగా కనిపించలేదు.దాంతో చేరికల కమిటీ చైర్మెన్ గా ఈటెల పెద్దగా ఎలాంటి ప్రభావం చూపడం లేదని బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.ఎన్నికల్లో ఏమాత్రం సత్తా చాటాలన్నా ఇతర పార్టీల నేతలను ఆకర్షించడం చాలా ముఖ్యం.కర్నాటక ఎన్నికల్లో నేతలను ఆకర్షించడంలో బీజేపీ విఫలం అయింది దాంతో ఓటమి మూటగట్టుకోక తప్పలేదు.
ఇక తెలంగాణలో( Telangana ) అలా జరగకూడదంటే ఖచ్చితంగా అసంతృప్త నేతలకు గాలం వేయడం చాలా అవసరం.అందుకే ప్రస్తుతం ” ఆపరేషన్ ఆకర్ష్ “( Operation Akarsh ) బీజేపీ గట్టిగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

నేతలను ఆకర్షించడంలో నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఈటెల ప్రస్తుతం తన బాద్యతలను నిర్వర్తించడంలో దూకుడు పెంచారు.గత కొన్నాళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ), జూపల్లి కృష్ణరావు లను బీజేపీలోకి ఆహ్వానించేందుకు ఈటెల రాజేంద్ర గట్టి ప్రయత్నలే చేస్తున్నారు.తాజాగా వీరిద్దరితో నిర్విరామ చర్చలు జరుపుతున్నారు.అయితే ఆ మద్య వీరిద్దరు కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపించాయి.కానీ ఇంతలోనే ఈటెల రంగంలోకి దిగి వారితో చర్చలు జరుపుతుండడంతో పొంగులేటి, జూపల్లి బీజేపీవైపు చూస్తారా అనే వాదన వినిపిస్తోంది.ఒకవేళ ఇద్దరు బీజేపీలో చేరితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ బలం పెంచుకునే అవకాశం ఉంది.
మరి ఈటెల చర్చలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.