ఎప్పుడూ.ధీమాగా… ఎవరు ఏం ప్రశ్నలు వేసినా తడుముకోకుండా సమాధానాలు చెప్తూ… తాజా రాజకీయాల మీద సంచలన విషయాలు చెప్పే లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాడు.తాను తప్పు చేసాను అంటూ… ఒప్పుకుంటున్నాడు.ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తుంది అంటూ… లగడపాటి తన సర్వే వివియారాలను బయటపెట్టి సంచలనం సృష్టించాడు.
అప్పటికే అనేక జాతీయ సర్వే సంస్థలు కూడా తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది అంటూ… ప్రకటించాయి.దీంతో అంతా కన్ఫ్యూజన్ అయ్యారు.కానీ లగడపాటి మీద నమ్మకంతో నిజంగా తెలంగాణాలో కూటమే అధికారం లోకి వస్తుందేమో అని అంత భావించారు.కానీ సీన్ రివర్స్ అయ్యింది.
అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న లగడపాటి ఎట్టకేలకు ఆ ప్రకటనపై నోరు విప్పాడు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు, తన సర్వేపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలపై దాటవేత ధోరణి అవలంభించారు.రాజకీయాల గురించి తిరుపతిలో మాట్లాడకూడదని అనుకుంటూనే మొన్న మాట్లాడేశానని చెప్పారు.అదే పెద్ద పొరపాటు అదే పెద్ద పొరపాటు అయిందని లగడపాటి చెప్పారు.
నిజానికి తిరుపతిలో తాను ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడనని చెప్పారు.కానీ మొన్న మీ అందరినీ చూసి ఆగలేక మాట్లాడేశానని చెప్పారు.
ఆ రోజు మాట్లాడడమే పొరపాటు అయిందని తెలిలారు.మళ్లీ ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించి మరో పొరపాటు చేయబోనని చెప్పి, అక్కడి నుంచి జారుకున్నారు.