హామీలు అమలు చేస్తారా ..? గాలి కొదిలేస్తారా ..?

హామీలు అమలు చెయ్యడం ఆ తరువాత గాలికి వదిలెయ్యడం నాయకులకు బాగా అలవాటు.ఎన్నికలసీజన్ లో ఆ హామీ ఈ హామీ అనే బేధం లేకుండా అన్ని రకాల హామీలు ఇచ్చేస్తుంటారు.

 Is That Telangana Political Parties Will Stand Up On Their Promises-TeluguStop.com

అయితే ఈ హామీలు అమలు గురించి మాత్రం ఎవరూ పెద్దగా ఆలోచన చేయడంలేదు.నాయకులు అన్నాక హామీలు ఇస్తారు… ప్రజలన్నాక మర్చిపోతారు అన్నట్టుగానే ఇప్పటి వరకు రాజకీయం నడుస్తోంది.

అన్ని రకాల పార్టీలు అధికారమే లక్ష్యంగా… ముందుకు వెళ్తున్నాయి.ఒకరిని మించి మరొకరు పోటాపోటీగా హామీల వర్షం కురిపిస్తున్నారు.అయితే…వాగ్దానాల అమలు, ఆదాయ-వ్యయాలేవీ లెక్కలోకి తీసుకుండా, మేనిఫెస్టోల్లో తమ వాగ్దానాలు ఇచ్చేస్తున్నారు.

ప్రధానంగా ఎక్కువ సంఖ్యలో ఓటర్లుగా ఉన్న రైతులను బుట్టలో వేసుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.అటు ప్రజాకూటమితో పాటు , ఇటు టీఆర్ఎస్‌ మేనిఫెస్టోల్లో వారికే… అత్యధిక ప్రాధాన్యమిచ్చాయి.అధికారంలోకి వస్తే, రైతులకు ఒకే దఫాలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రజాకూటమి ప్రకటిస్తే, లక్ష మాఫీ చేస్తామని టీఆర్ఎస్‌ వాగ్ధానాలు ఇచ్చాయి.రైతుబంధు కింద ఏడాదికి ఎకరాకు అందిస్తున్న సాయం రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని కేసీఆర్‌ చెబితే, ప్రజాకూటమి దాదాపు అంతే ప్రకటించింది.కానీ కౌలు రైతులనూ ఇందులో చేర్చి, ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

వీరితో పాటు … ముసలి వారికి పెన్షన్ ల దగ్గర నుంచి మొదలుపెట్టి ….వికలాంగులు, మరికొన్ని వర్గాల పెన్షన్లు.అన్ని రకాల ఆసరా పింఛన్లు రూ.వెయ్యి నుంచి రూ.2,016కి పెంచుతామని టీఆర్ఎస్ ప్రకటించింది.వికలాంగుల పింఛన్లు రూ.1,500 నుంచి రూ.3,016కి పెంచుదామని ప్రకటించింది.ఇలా చెప్పుకుంటూ పోతే… ఎన్నో ఎన్నెన్నో హామీలు అన్ని పార్టీలు ఇస్తూనే ఉన్నాయి.ఏదో ఒకరకంగా…ఓట్లు రాల్చే కార్యక్రమంగా ప్రజలను మభ్యపెడుతూ…ఆ హామీలతో ఓట్లుగా మలుచుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రణాళిక వేశాయి.

అయితే నాయకులు భారీ భారీగా ఇస్తున్న ఈ హామీలన్నింటిని ఒక్కసారి పరిశీలిస్తే… అసలు ఇవివి అమలు చేయడం సాధ్యమేనా అన్న అనుమానం కలుగుతోంది.దీంతో నాయకులు ఈ హామీలను అమలు చేస్తారా లేక ఎప్పటిలాగే గాలికి వదిలేస్తారా అనే అనుమానం అందరిలోనూ కలుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube