వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన పాదయాత్ర ఆ పార్టీకి కొత్త బలం ఇస్తోంది.ప్రస్తుతం కోనసీమలో జరుగుతున్న ఈ యాత్రకు అనూహ్యంగా జనం పోటెత్తుతున్నారు.
అన్ని పార్టీలకు అత్యంత కీలకమైన గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఆదరణ పెరుగుతుండడం మిగతా పార్టీల్లో దడ పుట్టిస్తోంది.పశ్చిమగోదావరి నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించేటప్పుడే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి మీద భారీ స్థాయిలో రావడం ఆ పార్టీలో మంచి జోష్ తీసుకురావడమే కాకుండా ఆడో శుభ సూచకంగా పార్టీ నేతలు భావిస్తున్నారు.

కోనసీమలో ప్రజా సంకల్ప యాత్రను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.దీనికి కారణం కూడా లేకపోలేదు.కాపు ఓటు బ్యాంకు మీద వైసీపీ దృష్టిపెట్టింది.అలాగే.దళిత ఓటు బ్యాంకుపైనా వైఎస్సార్సీపీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటోంది.అంతే కాకుండా సామాజిక వర్గాలకతీతంగా జనం ప్రజా సంకల్ప యాత్రకు పోటెత్తుతున్నారని వైసీపీ నేతలు చెప్తున్నారు.
కోనసీమలో ఈసారి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు వైసీపీ ప్లాన్ వేస్తోంది.
జగన్ యాత్ర చేయడం ఒక ఎత్తైయితే.
ఆ యాత్రకు వచ్చిన వారికి బోర్ కొట్టకుండా యాత్ర సాగుతున్నంతసేపు వారిలో అదే ఉత్సాహాన్ని కొనసాగించడం ఇంకో ఎత్తు.డబ్బులిచ్చి జనాన్ని రప్పిస్తున్నారంటూ ప్రజా సంకల్ప యాత్రపై అధికార టీడీపీ చేస్తున్న విమర్శలకు అమలాపురం బహిరంగ సభలో వైఎస్ జగన్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.మరోపక్క, తూర్పుగోదావరి జిల్లాలో జగన్ యాత్ర ప్రారంభమయినప్పటి నుంచీ, ‘డబ్బుతో వచ్చే జనం కాదు మేం.’ అని జనంతోనే చెప్పించడం ద్వారా జనాల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నాడు జగన్.