డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి డైరక్షన్లో కళ్యాన్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఇజం.ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఓ ఇంటెన్స్ క్రియేట్ చేసిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.
ఇక రిలీజ్ అయిన టీజర్ కూడా పూరి మరోసారి తన పోకిరి సినిమా మార్క్ చూపిస్తున్నట్టు ఉంది.కళ్యాన్ రామ్ ను సిక్స్ తో ప్యాక్ తో పవర్ ఫుల్ గా చూపిస్తున్న పూరి ఆ విషయాన్ని టీజర్ తోనే చెప్పేశాడు.
మరి కథ చెప్పడానికి ఇదో జర్నలిస్ట్ బాలకృష్ణ కథ అని తెలుసున్నా ఈ టీజర్ చూస్తుంటే పోకిరి సినిమాను తలపిస్తుంది.ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్న పూరి ఇజం మీదే అన్ని ఆశలు పెట్టుకున్నాడు.
ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ అవుతుంది.మరి పోస్టర్స్ తో ఏర్పడ్డ ఇంట్రెస్ట్ టీజర్ లో కూడా కంటిన్యూ చేసిన పూరి సినిమాలో మరోసారి తన కసిని చూపించేందుకు రెడీ అయ్యాడని టీజర్ చూసే చెప్పేయొచ్చు.
కళ్యాన్ రామ్ ను ఇదవరకు చూడని విధంగా చూపిస్తున్న పూరి సినిమా ఏ రేంజ్ ఫలితం అందుకుంటాడో చూడాలి.అదితి ఆర్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
.