జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన అనేక రకాల సమస్యల్లో కడుపు ఉబ్బరం చాలా ఇబ్బందికరమైనది.ఈ కడుపు ఉబ్బరం అనేది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన కలిగే వ్యాధి.
దీనికి ప్రధాన కారణం సమయానికి ఆహారం తీసుకోకపోవడం.ఆధునిక జీవనశైలి, పనుల ఒత్తిడి వలన ఓ పూట తినడం, మరో పూట తినకపోవడంతో వలన కడుపులో ఈ ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.
దీని వలన కడుపులో మంట, కడుపు ఉబ్బిన భావన, ఆకలి సరిగా వేయకపోవటం వంటి సమస్యలు వస్తాయి.ఈ కడుపు ఉబ్బరం వెనుక మనకు తెలియని కారణాలు కూడా ఉన్నాయి.
* డిప్రేషన్ కూడా కడుపు ఉబ్బరానికి కారణమవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.డిప్రేషన్ వలన హార్మోన్ల విడుదలలో జరిగే అవకతవకల వలన ఇలా జరుగుతుంది.
* యాంటిబయాటిక్స్ మెడిసిన్స్ ఎక్కువగా వాడినా శరీరానికి ప్రమాదమే.మరీ ముఖ్యంగా స్ట్రాంగ్ యాంటిబయాటిక్స్ అతిగా వాడితే కడుపు ఉబ్బరం మొదలవుతుంది.
* ఒకేచోట కూర్చోని పనిచేసేవారికి కూడా కడుపు ఉబ్బరం వస్తుంది.కంప్యూటర్ మీద గంటలకొద్దీ కూర్చోనే వారికే కడుపులో సమస్యలు ఇందుకే వస్తాయి.
దీనికీ కారణం రక్తప్రసరణ తగ్గడం.
* పీసిఓడి , థైరాడ్ సమస్యలతో బాధపడేవారికి కూడా కడులు ఉబ్బరం వస్తుంది.
ఈ డిజార్డర్ సమస్యలతో బాధపడేవారికి కడుపు ఉబ్బరం అదనం అన్నమాట.
* పొద్దున్న తిన్నామంటే మళ్ళీ సాయంత్రం తినడం, రాత్రి తిన్నామంటే తరువాతి రోజు మధ్యహ్నం తినడం లాంటి చేష్టల వలన కడపు ఉబ్బరం వస్తుంది.