అరకులో ఘోరం.. లోయలోకి వెళ్లిన టూరిస్ట్ బస్సు.. ?

ప్రతి మనిషి జీవితంలో ఆనందం, విషాదం అక్కచెళ్లెల్లుగా ఉంటాయంటారు.బహుశా అందుకే కావచ్చూ ఏడ్చినా, నవ్వినా కన్నీళ్లే వస్తాయి.

 8 Killed In Araku Ghat-road-accidentbus Crashed, Araku Valley, 8 Killed, Acciden-TeluguStop.com

ఇకపోతే మృత్యువు చెప్పిరాదు అన్న విషయం తెలిసిందే.అందుకే కావచ్చూ ఏకమొత్తంగా చాల మందిని తన వెంట తీసుకు వెళ్లింది.

ఆ వివరాలు చూస్తే.

అరకులోయ, ఘాట్‌రోడ్‌ ఐదో నంబరు మలుపు వద్ద టూరిస్ట్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది.

ఈ ఘోర ఘటనలో ఇప్పటి వరకు 8 మంది మృతిచెందినట్టు సమాచారం.ఇక ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు హైదరాబాద్‌కు చెందిన పర్యాటకులుగా గుర్తించారు పోలీసులు.

మరికొంత మంది టూరిస్టులకు గాయాలవగా, పలువురి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు అధికారులు.కాగా ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఎస్‌.కోట ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారట.ఇకపోతే బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతం చీకటిగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినట్లుగా సమాచారం.

ఈ ప్రమాద ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కదికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.ఇదిలా ఉండగా ఇంకా ఎంతమంది ఈ ప్రమాదంలో మరణించారనే విషయం క్లుప్తంగా తెలియదని, ప్రమాద స్దితిని బట్టి చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు సహయక చర్యలు చేస్తున్న వారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube