ప్రతి మనిషి జీవితంలో ఆనందం, విషాదం అక్కచెళ్లెల్లుగా ఉంటాయంటారు.బహుశా అందుకే కావచ్చూ ఏడ్చినా, నవ్వినా కన్నీళ్లే వస్తాయి.
ఇకపోతే మృత్యువు చెప్పిరాదు అన్న విషయం తెలిసిందే.అందుకే కావచ్చూ ఏకమొత్తంగా చాల మందిని తన వెంట తీసుకు వెళ్లింది.
ఆ వివరాలు చూస్తే.అరకులోయ, ఘాట్‌రోడ్ ఐదో నంబరు మలుపు వద్ద టూరిస్ట్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది.
ఈ ఘోర ఘటనలో ఇప్పటి వరకు 8 మంది మృతిచెందినట్టు సమాచారం.ఇక ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు హైదరాబాద్‌కు చెందిన పర్యాటకులుగా గుర్తించారు పోలీసులు.
మరికొంత మంది టూరిస్టులకు గాయాలవగా, పలువురి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు అధికారులు.కాగా ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఎస్.
కోట ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారట.ఇకపోతే బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతం చీకటిగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినట్లుగా సమాచారం.
ఈ ప్రమాద ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కదికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉండగా ఇంకా ఎంతమంది ఈ ప్రమాదంలో మరణించారనే విషయం క్లుప్తంగా తెలియదని, ప్రమాద స్దితిని బట్టి చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు సహయక చర్యలు చేస్తున్న వారు.