ఐపీఎల్ లో నిరుత్సాహ పరుస్తున్న రూ.8 కోట్ల ఆటగాడు.. 6 మ్యాచ్లలో 47 పరుగులు..!

ఈ ఐపీఎల్ సీజన్లో ఎట్టకేలకు ఢిల్లీ జట్టు బోణి కొట్టింది.ఢిల్లీ క్యాపిటల్స్( Delhi Capitals ) వరుస ఐదు మ్యాచ్లలో చిత్తుగా ఓడి ఆరో మ్యాచ్ తో పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది.

 8 Crore Player Is Disappointing In Ipl.. 47 Runs In 6 Matches , 8 Crore Player-TeluguStop.com

అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా( Prithvi Shah ) మాత్రం తన టాలెంట్ ను ప్రదర్శించలేకపోతున్నాడు.ప్లాప్ షోను కంటిన్యూ చేస్తున్నాడు.

ఈ సీజన్లో రిషబ్ పంత్ ( Rishabh Pant )లేని కారణంగా, ఆ స్థానాన్ని భర్తీ చేయడం కోసం వేలంలో 8 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది ఢిల్లీ ఫ్రాంచైజీ.రిషబ్ పంత్ లేని లోటు తీరుస్తాడు అనుకుంటే ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్లలో కేవలం 47 పరుగులతో నిరుత్సాహపరిచాడు.

ఈ ఐపీఎల్ లో ఒక్క మ్యాచ్లో కూడా కనీసం 20 పరుగుల మార్క్ కూడా దాటలేకపోయాడు.

ఈ ఐపీఎల్ లో తొలి మ్యాచ్ లక్నో జట్టుపై 12 పరుగులు చేశాడు.ఆ తర్వాత గుజరాత్ జట్టుపై 7 పరుగులు చేశాడు.ఇక రాజస్థాన్ రాయల్స్ పై డక్ ఔట్ అయ్యాడు.

ముంబై ఇండియన్స్ పై 15 పరుగులు చేశాడు.కోల్ కత్తా నైట్ రైడర్స్ పై 13 పరుగులు చేశాడు.

పృథ్వీ షా ఇదే ఆట తీరును కొనసాగిస్తే.ఐపీఎల్ మ్యాచ్ల్లో తుది జట్టులో చోటు దక్కడం కూడా కష్టమే.

ఇప్పటికే భారత జట్టుకు దూరమయ్యాడు.ఈ ఐపీఎల్ లో పేలవమైన ప్రదర్శన చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.

2018లో టీమిండియా తరఫున టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు.టీమిండియా తరఫున అండర్ 19 జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు.ఇతను బ్యాక్ ఫుట్ లో లెగ్ సైడ్ వైపు ఆడే షాట్లు చూసి అందరూ టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్ అనుకుంటే.ఇతనేమో పేలవమైన ప్రదర్శన చేస్తూ భవిష్యత్తు అవకాశాలను దూరం చేసుకుంటున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube