మహిళ వదిలేసిన లాటరీ టికెట్ కి తగిలిన 7 కోట్లు.. చివరికి..?!

మనకు ఏదైనా దక్కాలంటే కష్టంతో పాటు కొంత అదృష్టం కూడా ఉండాలంటారు.కొంతమందికి అనుకోకుండా అదృష్టం కలిసొస్తూ ఉంటుంది.

 7 Crores For A Lottery Ticket Left By A Woman .. In The End Lottery, Women, Luc-TeluguStop.com

ఇక కొందరికైతే వద్దన్నా దురదృష్టం వెంటాడుతుంది.ఇక లాటరీలు కొని తమ అదృష్టాన్ని పరీక్షించుకునే వారికి అప్పుడప్పుడు అదృష్టం కలిసొస్తుంది.లాటరీ తగిలితే వారి జీవితమే మారిపోతుంది.ఏమీ లేనోడు లక్షాధికారి అవుతాడు.కూటికి లేని వాళ్ళు కోటీశ్వరులు అయిపోతారు.తాజాగా లాటరీ టికెట్ కొన్న ఓ మహిళకు అదృష్టం కలిసొచ్చింది.

తనకు ఎలాగో లక్కీ లాటరీ రాదనుకొని ఆ మహిళ తన టికెట్ పారేసుకుంది.కానీ చివరకు అదృష్టం కొద్దీ ఆమెకే ఆ లక్కీ లాటరీ తగిలి రూ.7.3 కోట్లు డబ్బు ఆమె దగ్గరికే చేరుకుంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అమెరికాలోని మసాచుసెట్స్‌ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన అభీ అనే వ్యక్తి లక్కీ స్టాప్‌ అనే లాటరీ టికెట్ల షాప్‌ ను నిర్వహిస్తున్నారు.

లీ రోజ్‌ అనే మహిళ ఆ లాటరీ షాప్ కి ప్రతిరోజు వెళుతూ ఉంటుంది.టికెట్స్ కూడా కొంటూ ఉంటుంది.ఈ ఏడాది మార్చిలో ఆ లాటరీ షాప్ కి వెళ్లిన లీ రోజ్‌.ఒక మిలియన్ లాటరీకి సంబంధించిన టికెట్‌ కొనుక్కుంది.

ఆ టికెట్ ను స్క్రాచ్ చేసి లంచ్‌ కు వెళ్లాలనే తొందరలో ఆ టికెట్ ను పడేసి వెళ్ళిపోయింది.ఆమె ఆ టికెట్ ను సరిగా చూసుకోకుండానే.

లాటరీ రాలేదన్న నిరాశతో ఆ టికెట్ ను షాప్ వద్ద ఉన్న డస్ట్ బిన్ లో పడేసి వెళ్ళిపోయింది.ఆ టికెట్ 10రోజుల పాటు అక్కడే చెత్త బుట్టలో ఉండిపోయింది.

కట్ చేస్తే.ఆ లక్కీ టికెట్‌ అభికి దొరికింది.

లక్కీ లాటరీ టికెట్ అదే కావడంతో చూసి ఆశ్చర్యపోయారు.Telugu America, Lee Rooji, Lottery, Luck Chance-Latest News - Telugu

లక్కీ టికెట్‌ దొరకడంతో ఆ టికెట్ ను ఏం చేద్దామని అభీ తన కుటుంబ సభ్యులతో డిస్కస్ చేశాడు.రెండు రోజుల పాటు ఏం చేద్దామా అని ఆలోచించారు.ఆ లాటరీ డబ్బుతో అభీ ఓ కారును కొనేద్దామని డిసైడ్ అయ్యాడు.కానీ ఏమైందో ఏమో చివరికి అభి కుటుంబ సభ్యులు ఆ లక్కీ లాటరీ టికెట్ సొమ్మును ఆ టికెట్ కొనుక్కున్న కస్టమర్‌ కే అందజేయాలనుకున్నారు.

అనంతరం లీ రోజ్‌ కు అభీ ఫోన్‌ చేసి లాటరీ విషయాన్ని చెప్పాడు.ఈ విషయాన్ని లీ రోజ్ నమ్మలేదు.ఆ తర్వాత అభీ లాటరీ షాక్ కి ఆమెను రమ్మన్నాడు.ఆమె షాప్‌ కు వచ్చి టికెట్‌ చెక్ చేసుకుంది.

లాటరీ తగలడంతో హ్యాపీగా ఫీల్ అయ్యింది.లాటరీ షాప్‌ నిర్వాహకుల నిజాయితీకి ఆమె ఫిదా అయ్యింది.

ఇప్పుడు అభి షాప్ కి వెళ్లి మీడియా సంస్థలు ఇంటర్య్వూలు తీసుకుంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube