తాజాగా టర్కీ దేశం( Turkey ) కొన్యా ప్రావిన్స్‌లోని Çatalhöyük అనే సైట్‌లో పురావస్తు శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు.క్రీ.
పూ 6,600 నాటి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన బ్రెడ్‌ను వారు కనుగొన్నారు.ఈ పురాతన బ్రెడ్ మెకాన్ 66 అనే ప్రదేశంలో కొలిమి నిర్మాణం సమీపంలో దొరికింది.
మెకాన్ 66 అనేది పాత మట్టి ఇళ్ళతో కూడిన పెద్ద ప్రాంతంలో భాగం.
![Telugu Discovery, Konya Province, Latest, Turkey-Latest News - Telugu Telugu Discovery, Konya Province, Latest, Turkey-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/03/Turkey-archaeologists-discovery-Konya-province-viral-news-latest-news-trending-news.jpg)
ఈ ప్రాచీన కాలం నాటి బ్రెడ్‌ను కుక్ చేయలేదు కానీ బ్రెడ్ పిండిని రెడీ చేసి పులియడానికి వదిలేశారు.ఇది మధ్యలో వేలిముద్ర ఉన్న చిన్న రొట్టెలాగా ఉంటుంది, దీనిని తయారు చేయడానికి ప్రిపేర్ చేశారు కానీ ఎప్పుడూ వండలేదు.బ్రెడ్‌తో పాటు, పరిశోధకులు గోధుమ, బార్లీ( Wheat, Barley ) వంటి ధాన్యాలు, అలాగే బఠానీ విత్తనాలను కూడా కనుగొన్నారు.
ఈ పరిశోధనలు ప్రకారం అక్కడ నివసించే ప్రజలు ఈ మొక్కలను కలిగి ఉన్న ఆహారాన్ని తిని ఉంటారని తెలుస్తోంది.బ్రెడ్, ఇతర పదార్థాలను సన్నని మట్టి పొర కప్పి ఉంచడం వల్ల రొట్టె వేల సంవత్సరాలలో కుళ్ళిపోకుండా ఉంది.
![Telugu Discovery, Konya Province, Latest, Turkey-Latest News - Telugu Telugu Discovery, Konya Province, Latest, Turkey-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/03/Turkey-archaeologists-discovery-Konya-province-viral-news-latest-trending-news.jpg)
ఈ ఆవిష్కరణ ఉత్తేజకరమైనది ఎందుకంటే ఇది 8,000 సంవత్సరాల క్రితం జీవించిన వ్యక్తుల జీవితాల గురించి ఒక అవగాహన అందించింది.పిండిని నీటితో కలిపి బ్రెడ్ ఎలా తయారు చేయాలో వారికి తెలుసు అని, కిణ్వ ప్రక్రియ( Fermentation ) ప్రక్రియను అర్థం చేసుకున్నట్లు ఇది చూపిస్తుంది.నెక్‌మెటిన్ ఎర్బాకన్ యూనివర్శిటీ, గజియాంటెప్ యూనివర్శిటీ నిపుణులు బ్రెడ్‌ను అధ్యయనం చేస్తున్నారు.వారు దాని కూర్పును అర్థం చేసుకోవడానికి వారి కళ్ళతో, మైక్రోస్కోప్‌ల క్రింద దానిని దగ్గరగా చూశారు.
అందులో పిండి పదార్ధాలు, ధాన్యాలు ఉన్నాయని వారు కనుగొన్నారు, ఇది నిజంగా రొట్టె పిండి అని నిర్ధారించారు.ఈ అన్వేషణ కేవలం టర్కీకే కాదు ప్రపంచం మొత్తానికి ముఖ్యమైనది.
రొట్టె తయారీ చరిత్ర, నాగరికత ప్రారంభ ఆహారాలను అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.