నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ అడ్రస్ జీ తెలుగు.ఇప్పటికే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన జీ తెలుగు, ఇప్పుడు మరోసారి జీ కుటుంబం అవార్డులతో మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమైంది.
ఈ సారి పదోవ వార్షికోత్సవంతో మన ముందుకు వస్తుంది జీ తెలుగు కుటుంబం.అన్నపూర్ణ 7 ఎకర్స్ లో 10వ జీ కుటుంబం అవార్డ్స్ 2020 కార్యక్రమాన్ని కన్నుల పండుగగా, అంగరంగ వైభవంగా నిర్వహించింది.
ఈ అవార్డుల కార్యక్రమంలో సినీతారల డ్యాన్సులు, జీ కుటుంబ సభ్యుల అదిరిపోయే పర్ఫార్మెన్స్లు విశేషంగా ఆకట్టుకున్నాయి.
మునుపెన్నడూ చూడని రీతిలో జీ కుటుంబం అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించింది జీ తెలుగు.
ప్రభుత్వం విధించిన కోవిడ్ – 19 రూల్స్ ని పాటిస్తూ ఈ అవార్డు ఫంక్షన్ ని జరిపారు.సౌత్ ఇండియా రాజమాత రమ్య కృష్ణ , శృతి హాసన్, నిధి అగర్వాల్, నమిత, లక్ష్మి మంచు, తెలుగు సినిమా దిగ్గజాలైన ఎస్.
వి.కృష్ణా రెడ్డి, అచ్చిరెడ్డి, ఓంకార్, వి ఎన్ ఆదిత్య, కొండా విజయ్ కుమార్ ఇంకా ఎందరో అతిరథమహారధులు విచ్చేసి ఈ 10 వ జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ ని అంగరంగ వైభవంగా ముందుండి నడిపించారు.
జీ కుటుంబం అవార్డ్స్ 2020కి తమ యాంకరింగ్‌తో మరింత అందం తీసుకువచ్చారు శ్యామల , ప్రదీప్ మాచిరాజు మరియు రవి.వీరి కామెడీ టైమింగ్‌తో అవార్డుల కార్యక్రమంలో నవ్వుల పువ్వులు విరిశాయి.ఇక స్టార్ హీరోయిన్ నమిత జానీ మాస్టర్ తో కలిసి డాన్స్ చేసి అందరిని అబ్బురపరిచారు.అలాగే నిధి అగర్వాల్ తన నృత్యప్రదర్శన తో ప్రేక్షకుల మదులని కొల్లగొట్టారు.
ఇవే కాకుండా జీ తెలుగు యొక్క సీరియల్ నటీమణులు యాష్మి గౌడ, అనూష హెగ్డే, వర్ష హెచ్ కే , జయ కవి, సునంద మాలాశెట్టి, పూజ మూర్తి మరియు శిరీష రొమాంటిక్ పాటల మీద డాన్స్ చేసి అందరి హృదయాల్ని గెలుచుకున్నారు.వీటితో పాటు యశస్వి పరమపదించిన ఎస్.పి.బాలసుబ్రమణ్యం గారికి నివాళులు అర్పించాడు.
జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2020 ఈ ఆదివారం అంటే 1 వ నవంబర్ సాయంత్రం 5 గంటలకు ప్రసారం చేయబడుతుంది.
జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2020 లో ఇంకా ఏం జరిగాయి అని తెలుసుకోవాలంటే జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి ఛానళ్లలో తప్పక వీక్షించండి
.