టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) నివాసానికి వైఎస్ షర్మిల( YS Sharmila ) వెళ్లారు.ఇందులో భాగంగా తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు అందించారు.
తన కుమారుని పెళ్లి వేడుకకు కుటుంబ సమేతంగా రావాలని చంద్రబాబును షర్మిల ఆహ్వానించారు.
కాగా ఫిబ్రవరి 17వ తేదీన వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం( YS Rajareddy Marriage ) జరగనుందన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే పలువురిని పెళ్లికి ఆహ్వానించిన వైఎస్ షర్మిల తాజాగా చంద్రబాబును ఆహ్వానించారు.