జగనన్న బాణం రివర్స్ కానుందా? షర్మిల మాటలకు అంతరార్థం ఏమిటి..

2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ విజయదుందుభి మోగించడం వెనుక వైఎస్సార్ తనయురాలు వైఎస్ షర్మిల కృషి ఉంది.జగనన్న వదిలిన బాణాన్ని అనుకుంటూ ఆమె ఊరూ వాడ తిరిగిన విధానం ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు.

 Ys Sharmila Shocking Comments Over Establishing Political Party In Ap Details, J-TeluguStop.com

కానీ 2019లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం షర్మిలను పెద్దగా పట్టించుకోలేదు.దానికి తోడు ఇంట్లో అన్నా చెల్లెల్ల మధ్య విభేదాలు రావడంతో ఆమె జగన్ నుంచి దూరంగా వచ్చేసి తెలంగాణలో పార్టీని స్థాపించారు.

పార్టీ అయితే పెట్టారు కానీ షర్మిల పార్టీలో అగ్ర స్థాయి నాయకులు లేరు.వైఎస్సార్ అంటే ఆంధ్రా వ్యక్తనే అభిప్రాయం అందరిలోనూ ఉంది.

అందుకే షర్మిల తాను తెలంగాణ కోడలినే అని చెబుతూ ఇక్కడ పార్టీని స్థాపించింది.పార్టీ అయితే స్థాపించింది కానీ ఇక్కడి ప్రజలు షర్మిలను పెద్దగా ఆదరిస్తున్నట్లు కనిపించడం లేదు.

ఇటీవల మీడియా సమావేశంలో పాల్గొన్న షర్మిల ఏపీలో కూడా రాజకీయ పార్టీ పెడతానని చెప్పారు.ఒక వేళ మనసులో లేకపోతే ఆమె అలా ఎందుకు అంటారని ఇప్పుడు చర్చ నడుస్తోంది.

తెలంగాణలో పార్టీకి అనుకున్న మైలేజ్ రావడం లేదు కాబట్టి ఆమె ఏపీ దిక్కుకు చూస్తున్నారని చెబుతున్నారు.రాజన్న రాజ్యం తెస్తాడని చెప్పిన తన సోదరుడు అందులో విఫలమయ్యాడని ఆమె ఒప్పుకుందా? అనే సందేహాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి.

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Sharmila, Ys Sharmila-Telugu Political News

ఈ ప్రకటనతో వైసీపీ నేతలు అయోమయంలో పడ్డారు.మరి వైఎస్సార్ ఇంటిలో విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో కానీ ఇప్పుడు షర్మిల ఏకంగా తన అన్నకే అపోనెంట్ గా మారి పార్టీ పెడతాననడం చర్చనీయాంశమవుతోంది.మరి షర్మిల ఏపీలో కూడా పార్టీని స్థాపిస్థారో లేదో భవిష్యత్ లో తెలియనుంది.ఆమె తెలంగాణలో పార్టీని మూసేసి ఏపీలో స్థాపిస్తారా లేక రెండు చోట్ల పార్టీలు ఉండేలా చూసుకుంటారో?

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube