ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.ఎంతో మంది వినియోగదారులు దీన్ని వినియోగిస్తున్నారు.
యూట్యూబ్ ద్వారా మనకు తెలియని విషయాలను ఎన్నో నేర్చుకోవచ్చు.లేదా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వినియోగించవచ్చు.
ఒక్కోసారి పూర్ కనెక్షన్ ఉన్నపుడు వీడియో చూసే అవకాశం ఉండదు.అప్పుడు వాచ్ లేటర్ ఆప్షన్ ఉపయోగించవచ్చు.
దీనికి ఇంకో ఫీచర్ కూడా ఉంది.ఆ వివరాలు తెలుసుకుందాం.
యూట్యూబ్‌లో రెండు విధాలుగా వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.రెండూ సులభమైన పద్ధతులే.దీనికి యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి ఆఫ్‌లైన్ వ్యూ కోసం వీడియో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ఇది లోకల్ స్టోరేజీలో సేవ్ అవ్వదు.
దీనికి ఇతర పద్ధతులు ఉన్నాయి.యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసినపుడు వీడియో కింద డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది.
దీనిపై ట్యాప్ చేస్తే.డౌన్‌లోడ్ మొదలవుతుంది.
ఆ తర్వాత లైబ్రరీ సెక్షన్‌లో డౌన్‌లోడ్ చేసిన వీడియోలు ఉంటాయి.దాంతో అవి ఇంటర్నెట్ అవసరం లేకుండానే వీడియోలను చూడవచ్చు.
మరో ఆప్షన్ యూట్యూబ్ యాప్‌లో వీడియో ఓపెన్ చేయగానే కుడివైపు మూడు చుక్కలు ఉంటాయి.దాన్ని క్లిక్ చేస్తే అందులో కూడా డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది.ఫోన్ లోకల్ స్టోరేజీలో వీడియోలు సేవ్ అవ్వాలంటే థర్డ్ పార్టీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

స్నాప్‌ట్యూబ్ .ఇది ప్లేస్టోర్‌లో అందుబాటులో లేదు కానీ, సంబంధిత అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఈ స్నాప్‌ట్యూబ్‌తో కేవలం యూట్యూబ్ మాత్రమే కాకుండా ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ ఇతర వీడియోలను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దీనికి స్నాబ్‌ట్యూబ్‌లో యూట్యూబ్ వీడియో యూఆర్‌ఎల్‌ను కాపీ చేయడం ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.అప్పుడు ఫోన్ గ్యాలరీలోకి డౌన్‌లోడ్ అయిపోతుంది.అందులో లేకపోతే సెట్టింగ్ సెక్షన్‌లోకి వెళ్లి ‘డౌన్‌లోడ్ పాత్’లో చెక్ చేసుకోవాలి.దీనికి ‘మీ’పై క్లిక్ చేస్తే సెట్టింగ్ ఐకాన్‌లో డౌన్‌లోడ్ సెట్టింగ్స్ ఆప్షన్ ద్వారా ‘డౌన్‌లోడ్ పాత్’ ఆప్షన్‌ను ఉపయోగించి ఎక్కడ కావాలో అక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.