యూట్యూబ్‌ నయా ఫీచర్‌.. యాప్‌లను వాడుతూనే..వీడియోలను వీక్షించండి!

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ యాప్‌ యూట్యూబ్‌లో నయా ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది.ఎన్నిరోజుల నుంచో వినియోగదారులు ఈ ఫీచర్‌ కోసం ఎదురు చూస్తున్నారు.

 Youtube New Picture In Picture Feature Launched.latest News,social Media-TeluguStop.com

ఇప్పటికే యూట్యూబ్‌కు కొన్ని మిలియన్ల మంది ప్రతిరోజూ వీక్షిస్తారు.ఇది అతిపెద్ద వీడియో యాప్‌.

దీన్ని మొబైల్‌తో వీక్షించవచ్చు.ఆ వివరాలు తెలుసుకుందాం.

యూట్యూబ్‌ వీక్షించేటపుడు గతంలో ఇతర యాప్‌లను ఓపెన్‌ చేసే అవకాశం ఉండలేదు.అంటే, పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ సౌలభ్యం లేకుండే.ఇతర యాప్‌లను ఆపరేట్‌ చేయాలంటే యూట్యూబ్‌ పూర్తిగా క్లోజ్‌ అయిపోతుండే! బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అయ్యే అవకాశం వినియోగదారులకు అందుబాటులో లేకుండా పోయేది.ఈ సమస్యకు బ్రేక్‌ వేస్తూ కొత్త ఫీచర్‌ను తమ వినియోగదారులకు పరిచయం చేసింది.

ఈ ఫీచర్‌నుర భారత్‌లో కూడా విడుదల చేసింది.దీంతో యూజర్లు వీడియోటను ఇతర యాప్‌లను ఓపెన్‌ చేసి యూట్యూబ్‌ వీడియోలను మినీ ప్లేయర్‌గా ప్లే చేస్తునే, ఇతర యాప్‌లను కూడా వాడచ్చు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్‌ వినియోగదారులకు ఈ ఫీచర్‌ ఎంతో హర్షించతగ్గ విషయం.కానీ, ఈ పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ ఫీచర్‌ అందరికీ అందుబాటులో ఉండదు.

కేవలం యూబ్యూబ్‌ ప్రీమియంను సబ్‌స్క్రైబ్‌ చేసుకున్న, ఐఓఎస్‌ అంటే యాపిల్‌ ఫోన్‌ వినియోగదారులకే అందుబాటులో ఉంది.ఈ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు ప్రీమియం వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు యూట్యూబ్‌ జూన్‌ మాసంలోనే తెలిపింది.

ఈ పీఐపీ ఫీచర్‌ పరిశోధనలు అక్టోబర్‌ 31 వరకు జరగనున్నాయి.ఈ ఫీచర్‌ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి రాలేదు.

Telugu Apple Store, Latest Youtube, Picture Picture, Youtube Program, Youtube-La

పీఐపీ మోడ్‌ను యాక్టివేట్‌ చేసుకునే విధానం.ముందుగా మీ స్మా ర్ట్‌ ఫోన్‌లోని యూట్యూబ్‌ ను ఓపెన్‌ చేసి, ప్రీమియం ఖాతాకు సైన్‌ ఇన్‌ అవ్వాలి.హోంపేజీలో ఉండే ‘న్యూ’ సెక్షన్‌ను ఎంచుకోవాలి.

ఆ తర్వాత ‘పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ ఫర్‌ ఐఓఎస్‌’ ను క్లిక్‌ చేయాలి.‘ట్రై ఇట్‌ అవుట్‌’ బటన్‌పై ట్యాప్‌ చేయాలి.

అప్పుడు సైన్‌ అప్‌ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.ఇప్పుడు వీడియోటను వీక్షిస్తూనే, ఇతర యాప్‌లను ఉపయోగించవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube