యువతీ,యువకులు తొలిచూపులోనే ఆకర్షణకులోనై ప్రేమించుకోవడం, కొంత కాలం తరువాత ఇరువురి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోవడం ఈ రోజుల్లో సర్వసాధారణం.ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి సంఖ్య కంటే.
ప్రేమించి విడిపోయిన వారి సంఖ్యనే అధికంగా పెరుగుతోంది.ఒక యువకుడు ప్రేమిస్తున్నా అని ఓ యువతి వెంటపడి.
తర్వాత పెళ్లి చేసుకోవాలంటూ వేధించడం మొదలుపెట్టాడు.కానీ ఆ యువతి వివాహానికి( Marriage ) ఒప్పుకోకపోవడంతో ఏకంగా చంపేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం( Uttar Pradesh ) నందగ్రామ్ పరిధిలోని గుక్నా గ్రామంలో దీప్ మాలా (24)( Deep Mala ) అనే యువతి నివసిస్తోంది.అయితే బులంద్ షహార్ జిల్లా సాలెంపూర్ లోని తన అమ్మమ్మ ఇంటికి తరచూ వస్తూ పోతుండేది.అయితే సాలెంపూర్ లో ఉండే రాహుల్ చౌదరి (26)( Rahul Chaudary ) అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ దీప్ మాలా వెంటపడేవాడు.కొద్ది రోజులు గడిచిన తర్వాత దీప్ మాలా, రాహుల్ చౌదరిలు ప్రేమించుకోవడం మొదలుపెట్టారు.
మరికొంత కాలం గడిచాక పెళ్లి చేసుకుందాం అంటూ వేధించడం మొదలుపెట్టాడు.అందుకు ఆ యువతి అంగీకారం తెలుపకపోవడంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
గురువారం రాత్రి దీప్ మాలా సొంత ఊరైన గుక్నా కు వెళ్లి పెళ్లి చేసుకోవాలని వేధించాడు.ఆమె పెళ్లికి మళ్లీ నిరాకరించడంతో తనతో పాటు తెచ్చుకున్న తుపాకీ తో ఆ యువతిని కాల్చేశాడు.వెంటనే రాహుల్ చౌదరి పాయిజన్ తాగాడు.తుపాకీ శబ్దం విని చుట్టుపక్కల వారు వచ్చేలోపే రక్తపు మడుగులో పడి యువతి చనిపోయింది.కొన ఊపిరితో ఉన్న రాహుల్ను నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని జీటీవీ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.