లోకేష్ పాదయాత్ర పై వైసిపి టెన్షన్ ? ఆ నివేదికలే కారణమా ?

టిడిపి ( TDP party )(జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh )చేపట్టిన యువ గళం పాదయాత్ర పై మొదట్లో వైసిపిని టార్గెట్ గా చేసుకుని పెద్ద ఎత్తున విమర్శలు చేసింది.ఇక తర్వాత చాలా కాలం పాటు ఆయన పాదయాత్ర విషయాన్ని పక్కన పెట్టింది .

 Ycp Tension On Lokesh Padayatra Are Those Reports The Reason-TeluguStop.com

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టడంతో పూర్తిగా వైసిపి నాయకులంతా పవన్ ను,  జనసేన ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం,  ఎక్కువగా పవన్ యాత్రపైనే దృష్టి సారించడంతో , లోకేష్ యాత్ర సైలెంటుగానే ముందుకు వెళ్ళిపోయింది.ప్రస్తుతం లోకేష్ చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది.

ఆ తర్వాత ఉమ్మడి గుంటూరు కృష్ణాజిల్లాలో కి ప్రవేశిస్తుంది.అయితే ఈ పాదయాత్ర పై సైలెంట్ గా ఉంటూ వస్తున్న వైసిపి నేతలు ఇప్పుడు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Lokesh-Politics

 ఈ యాత్రను, లోకేష్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి( Vijayasai Reddy ) వరుసగా సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలోకి లోకేష్ పాదయాత్ర అడుగుపెట్టగానే, ఆయనపై ఈ విమర్శల దాడి ఎక్కువ అయింది.ఎంపీ విజయసాయిరెడ్డి తో పాటు , మంత్రి అంబటి రాంబాబు తదితరులు లోకేష్ యాత్రను టార్గెట్ చేసుకున్నారు.

ఒక్కసారిగా వైసిపి కీలక నాయకులంతా లోకేష్ యాత్రపై ఫోకస్ చేయడం వెనక కారణాలు ఉన్నాయట.గతంతో పోలిస్తే లోకేష్ యాత్రకు ప్రజల నుంచి స్పందన వస్తోంది.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Lokesh-Politics

ఆయన వైసిపి( YCP party ) స్థానిక నాయకుల పైన చేస్తున్న విమర్శలకు,  ప్రజల నుంచి స్పందన వస్తూ ఉండడం వంటి వాటిపై నిఘా నివేదికలు అందడంతోనే,  ఈ స్థాయిలో అలర్ట్ అయినట్లుగా ప్రచారం జరుగుతుంది.ప్రస్తుతం పవన్ వారాహి యాత్ర నిలిచిపోవడం,  లోకేష్ యాత్ర తో యాక్టివ్ కావడం,  అదే పనిగా వైసిపి ప్రభుత్వం పై విమర్శలు చేయడం,  రోడ్ల దుస్థితి,  ప్రజల సమస్యల పైన స్పందిస్తూ సెటైర్లు వేస్తూ ఉండడం వంటి వాటిని సీరియస్ గా తీసుకున్న వైసీపీ నాయకులు ఎక్కడకక్కడ లోకేష్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఇక లోకేష్ కూడా తాను పాదయాత్ర నిర్వహించి నియోజకవర్గాల వారీగా పూర్తి సమాచారం తెప్పించుకుని,  ఆ నియోజకవర్గ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల అవినీతి వ్యవహారాలు, ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజల్లో హైలెట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ తరహా వ్యవహారాల కారణంగా వైసిపి గ్రాఫ్ తగ్గకుండా ముందు జాగ్రత్త చర్యలకు దిగినట్లుగా అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube