కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంపై( Pithapuram Constituency ) వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది.ఈ మేరకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, వంగా గీత, పెండెం దొరబాబుతో ఎంపీ మిథున్ రెడ్డి( MP Mithun Reddy ) ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై నేతలతో మిథున్ రెడ్డి చర్చిస్తున్నారని తెలుస్తోంది.అలాగే రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై ఆయన చర్చిస్తున్నారు.సర్వేలో పార్టీ గ్రాఫ్ పెరిగిందని చెప్పిన మిథున్ రెడ్డి నేతలు విభేదాలు పక్కనబెట్టి కలిసి పని చేయాలని మిథున్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.