తల్లి ప్రేమ. ఈ ప్రపంచంలో ఎవరైనా, ఎంత డబ్బున్న వారైనా సరే వెలకట్టలేని వస్తువేదైనా ఉందా అంటే అది తల్లి ప్రేమ.
అంతటి గొప్ప తల్లి ప్రేమను కొంత మంది హేళన చేస్తూ మాట్లాడుతారు.తమకు జన్మనిచ్చిన తల్లులను సరిగ్గా పట్టించుకోకుండా అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తారు.
కానీ తల్లి మనల్ని కని పెంచిన తీరును తలుచుకుంటేనే అమోఘంగా ఉంటుంది.తొమ్మిది నెలల మనల్ని కడుపులో మోసి, ఎన్నో అవస్థలను ఓర్చుకుని మనకు జన్మనిస్తుంది.
తాను ఎన్ని అవస్థలు పడినా పరవాలేదు కానీ తమ పిల్లలు మాత్రం సంతోషంగా ఉండాలని తల్లి ప్రాధేయపడుతుంది.కావున ప్రపంచంలో ఉన్న అన్ని ప్రేమల కంటే ఎక్కువగా తల్లి ప్రేమ విలువైందని అందరూ చెబుతారు.
ఈ సృష్టి మీద ఉన్న రకరకాల జంతువులు తమ ద్వారా పిల్లలకు జన్మనిచ్చే విధానాలు వేర్వేరుగా ఉంటాయి.కొన్ని జంతువులు గుడ్లు పెట్టి పొదిగి పిల్లలకు జన్మనిస్తే మరికొన్ని జంతువులు మాత్రం డైరెక్టుగా జన్మనిస్తాయి.
మన మనుషులలాగ.ఇక కొన్ని జంతువులు తాము చనిపోతూ తమ పిల్లలకు జన్మనిస్తాయి.
సముద్రంలో ఉండే డాల్ఫిన్ల గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు.అవి చాలా సరదాగా ఉంటాయి.
వాటిని చూస్తే మనకు భలే అనిపిస్తుంటుంది.అలా డాల్ఫిన్లు వింత చేష్టలు చేస్తూ మానవులను ఖుషీ చేస్తుంటాయి.కానీ డాల్ఫిన్ ఎలా ప్రసవిస్తుందో ఇప్పటి వరకు చాలా మంది చూసి ఉండరు.కానీ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.ఈ వైరల్ వీడియోలో సముద్రం అడుగు భాగాన ఓ డాల్ఫిన్ తన బిడ్డకు జన్మనిస్తూ ఉండడం గమనించవచ్చు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇది చూసిన అనేక మంది వివిధ రకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.