బుల్లెట్ బైక్‌కు పూజ‌లు.. ఎక్క‌డంటే..?

మన దేశంలోని చాలా ప్రదేశాల్లో వింత ఆచారాలను పాటిస్తుంటారు.కొన్ని చోట్ల పిల్లులను పూజిస్తే మరికొన్ని చోట్ల విచిత్రంగా కుక్కలకు గుడి కట్టి పూజిస్తారు.

 Worship The Bullet Bike Where, Bullet , Bullet Baba , Jod Poor , Om Singh Rathor-TeluguStop.com

ఇప్పుడు మనం చెప్పుకోబేయే విషయం మరింత వింతగా ఉంటుంది.రాజస్తాన్ లోని పానీ జిల్లాలో మనమంతా నడిపే బుల్లెట్ కు గుడి కట్టి పూజలు చేస్తారు.

ఇలా బుల్లెట్ కు పూజలు చేసే ఆచారం తమ పూర్వీకుల నుంచి కొనసాగుతుందని అక్కడి వారు చెబుతారు.ఇలా చేయడం వల్ల తమకు రోడ్డు ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుందని వీరు నమ్ముతారు.

ఇదేంటని షాక్ అవుతున్నారా.జోద్ పూర్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గుడి విశేషాల గురించి తెలుసుకుందామా.

పానీ జిల్లాలో స్థానికంగా ఉన్న ఓం సింగ్ రాథోర్ అనే గుడిలో పూర్వకాలం నుంచి బుల్లెట్ బండికి పూజలు చేస్తున్నారు.అసలు బండికి పూజలు చేయటమేంటని ఇక్కడి వారిని అడిగితే బుల్లెట్ బాబా గుడి గురించి ప్రచారంలో ఉన్న కథ వివరించారు.

Telugu Bullet Baba, Bullet Bike, Temple, Jod Poor, Om Singh Rathor, Paani Dist,

1988లో ఓం సింగ్ రాథోర్ తనకున్న బుల్లెట్ మీద వెళ్తూ.ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో మరణించాడట.పోలీసులు కేసు దర్యాప్తు కోసం సీజ్ చేసిన ఆ బుల్లెట్ బైకు ప్రతి సారి ప్రమాదం జరిగిన ప్రదేశంలో ప్రత్యక్షమయయ్యేదట.దీంతో స్థానికులు ఓనర్ ఓం సింగ్ ఆత్మ బుల్లెట్ లోనే ఉందని.

ఆ బండికి గుడి కట్టి పూజలు చేస్తున్నారు.ఈ గుడి రాజస్తాన్ లో చాలా ఫేమస్ అట.ఆ ఊరి వాళ్లే కాకుండా చుట్టు పక్కల గ్రామాల వాళ్లు కూడా వచ్చి తమను రోడ్డు ప్రమాదాల నుంచి రక్షించమని బుల్లెట్ ను వేడుకుంటారట.వింటుంటూనే విచిత్రంగా ఉంది కదూ ఈ బుల్లెట్ బాబా గుడి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube