ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్‌కు ఇప్పటికే చాలా మంది వినియోగదారులకు ఆకట్టుకుంది.మరికొన్ని కొన్ని కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ.
యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందిస్తూనే ఉంది.ఈ నేపథ్యంలో వినియోగదారులు కొన్ని ట్రిక్స్ పాటించడం వల్ల స్టోరేజీని కూడా సేవ్ చేయవచ్చు.
ఆ వివరాలు తెలుసుకుందాం.వాట్సాప్ చాట్‌లో ఏవైనా ఇమేజ్, వీడియోస్ వస్తే .అవి ఆటోమెటిగ్గా ఫోన్ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది.దీనికి అదనంగా స్టోరేజీ అవసరమవుతుంది.
అయితే, ఓ సెట్టింగ్ మార్చుకోవడం వల్ల వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే ఇమేజెస్ మనకు వద్దనుకుంటే.ఆటో డౌన్‌లోడ్ ఆప్షన్‌ను ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.
అప్పుడు అవి ఆటోమెటిగ్గా డౌన్‌లోడ్ అవ్వదు.మీడియా విజిబిలిటీ ఆప్షన్ కేవలం కొత్తగా వచ్చిన మీడియా ఫైల్స్‌కే ప్రభావితం అవుతుంది.మీకు కావాల్సిన మీడియాను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఈ ఫీచర్‌ను ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.
వాట్సాప్ మీడియా సెట్టింగ్….

మీకు వాట్సాప్‌లో వచ్చే మీడియా ఫైల్స్, ఇమేజెస్, వీడియోస్ ఆటోమెటిగ్గా డౌన్‌లోడ్ అవ్వకూడదు అనుకుంటే… ఇక సులభంగా మార్చుకోవచ్చు.దీనికి మీ వాట్సాప్‌లోని కుడివైపున పైభాగంలో ఉండే మూడు చుక్కల్లో సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది.అందులో ‘స్టోరేజీ అండ్ డేటా’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.అందులో ‘మోబైల్ డేటా ఆధారంగా అనే ఆప్షన్‌పై ట్యాప్ చేసి, ఫోటోస్, ఆడియో, వీడియో, డాక్యుమెంట్స్‌పై టిక్ మార్క్‌ను పెట్టాలి.
దీంతో ఇవన్ని ఆటోమెటిగ్గా మీ ఫోన్ మెమోరీలో డౌన్లోడ్ అవ్వవు.మీకు కావాలిస్తే ఆ మీడియాపై డౌన్‌లోడ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది.ఈ సెట్టింగ్ కేవలం మొబైల్ డేటా ఆధారంగానే చేసే అవకాశం ఉంటుంది.ఒకవేళ వైఫై ఆధారంగా పొందాలంటే వాట్సాప్ సెట్టింగ్‌లో ఉన్న ‘వైఫై కనెక్షన్ ఆధారంగా.’ ఆప్షన్ టిక్ తీసివేయాలి.
మీడియా విజిబిలిటీ సెట్టింగ్…

వాట్సాప్ ఈ ఫీచర్‌ను ప్రతి వాట్సాప్ చాట్‌లో … గ్రూపుల్లో కూడా మార్చుకునే అవకాశం ఉంది.ఇమేజెస్, వీడియోస్ ఆటోమెటిక్ డౌన్‌లోడ్ అవ్వకూడదు అనుకుంటే సదరు వ్యక్తి ప్రొఫైల్‌లోకి వెళ్లి అందులో ఉండే మీడియా విజిబిలిటీ ఆప్షన్‌ను ‘నో’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.ఈ ఫీచర్‌ను మీ అన్ని వాట్సాప్ చాట్‌లకు వర్తింపజేయాలని అనుకుంటే నేరుగా సెట్టింగ్‌లోకి వెళ్లి మార్చుకోవచ్చు.
సెట్టింగ్ ఆప్షన్‌లో ఉండే ‘చాట్స్’పై ట్యాప్ చేసి, మీడియా విజిబిలిటీని డిసేబుల్ చేసుకుంటే సరిపోతుంది.