తెలంగాణలో కొన్ని రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణంలో జరిగిన అల్లర్లు ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మనం చూసాం.అయితే బీజేపీ ఆ అల్లర్లపై మరింతగా వ్యాఖ్యలు చేయడంతో అది రాష్ట్ర వ్యాప్త సమస్యగా మారింది.
అయితే మీడియా, రాజకీయ పార్టీలు మొత్తం భైంసా అల్లర్లపై దృష్టి సారించడంతో ఓ ఘోరం వెలుగులోకి రాలేదు.భైంసా అల్లర్లు జరిగిన తరువాత పోలీసులు 144 సెక్షన్ విధించిన సంగతి తెలిసిందే.
అయితే అదే సమయంలో ఓ నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన వెలుగులోకి రాలేదు.
అయితే బండి సంజయ్ భైంసా అల్లర్ల బాధితులను పరామర్శించడానికి హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
అయితే ఇప్పుడు జస్టిస్ ఫర్ భైంసా చైల్డ్ పేరుతో మరో సోషల్ మీడియా ఉద్యమం రానున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే సోషల్ మీడియాలో భైంసా ఘటన నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు ఘటనకు సంబంధించిన అసలు వివరాలు రాకున్నా పెద్ద దుమారమే రేగనున్నట్టు సూచనలు కనిపిస్తున్నాయి.ఈ విషయంపై బీజేపీ మరో పిలుపు ఇచ్చి రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉందని పెద్ద నిరసన తెలిపే అవకాశం ఉంది.