ఏపీలో ఎన్నికల టైం దగ్గర పడుతున్న కొద్దీ.నాయకులు జోరు పెంచారు.
ఒకరి తర్వాత ఒకరు యాక్టివ్ అవుతున్నారు.ఇంతకాలం సైలెంట్ గా ఉన్న కేడర్ ను కూడా యాక్టివ్ చేస్తున్నారు.
ఏపీలో ఇప్పటికే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోయాయి.వాటికి భవిష్యత్తులో కూడా భవిష్యత్తు కనిపించడం లేదు.ఇక మిగిలింది జనసేన, తెలుగు దేశం, బీజేపీ పార్టీలు.2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ఈ సార్టీలు ఈ సారి ఎన్నికల్లో 2014 సీన్ రిపీట్ చేయాలని భావిస్తున్నారు.
ఈసారి కూడా అన్నిటికీ కర్తా, కర్మా క్రియా చంద్రబాబే చూసుకుంటూ ఉన్నారు.ఒక వైపు జనసేన పార్టీని కలుపుకుంటూ.లోకేష్ కు మాస్ ఇమేజ్ ను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.ప్రజల్లో ఇమేజ్ పెరగాలంటే ఉన్న ఒకే ఒక్క రూట్.
పాదయాత్ర.దాంతో లోకేష్ ను చంద్రబాబు పాదయాత్రకు సిద్ధం చేశారు.
ఏమైందో ఏమో గానీ నారా వారికి ఈ ఏడాది అస్సలు కలసిరావడం లేదని విశ్లేషకులు అంటున్నారు.చంద్రబాబాు సభల్లో ఒకసారి ఎనిమిది మంది, మరో సారి ముగ్గురు మరణించారు.
దాన్నించి కోలుకోక ముందే.లోకేష్ పాదయాత్రకు ఆదిలోనే హంస పాదు ఎదురయింది.

లోకేష్ యువగళం మొదలయిన మొదటిరోజే.నందమూరి తారక రత్న అస్వస్థకు గురిఅయ్యాడు.అంతే కాకుండా ఆయన పరిస్థితి విషమంగా మారింది.ఒక వేళ ఆయనకు జరగరానిది ఏదైనా జరిగితే.అది ఖచ్చితంగా నారా వారి మెడకే చుట్టుకుంటుందని.విశ్లేషకులు చెబుతున్నారు.
తారక రత్నాను ఉపయోగించుకుని.మొత్తం నందమూరి ఫ్యామిలీని లోకేష్ యాత్రకు తీసకు రావాలని చంద్రబాబు ప్లాన్ చేశారు.
దాంతో నారా వర్సెస్ నందమూరి అనే ముద్రను చెరిపివేస్తూ.మరో వైపు లోకేష్ కు మాస్ ఇమేజ్ తీసుకు రావాలని చూశారు.

అయితే చంద్రబాబు ప్లాన్ బెడిసికొట్టినట్టు కనిపిస్తోంది.నారా లోకేష్‌ది ఐరన్ లెగ్ అని అందుకే తారక రత్నకు ఇలా జరిగిందని.ఓ వర్గం నెటిజన్లు అప్పుడే దుమ్మెత్తి పోస్తున్నారు.తారక్ రత్న ఎపిసోడ్ తో నారావారి ప్లాన్ బెడిసికొట్టినట్టు కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.