మునుపెన్నడూ లేని విధంగా అభ్యర్థులను దరఖాస్తులు ఆహ్వానించి ఎన్నిక చేస్తే కొత్త సాంప్రదాయానికి తెరతీసిన కాంగ్రెస్ ఇప్పుడు దాని ఫలితాలతో తల పట్టుకున్నట్లుగా తెలుస్తుంది 119 నియోజకవర్గాలకు దాదాపు 900 మంది దరఖాస్తు చేసుకోవడంతో ఇప్పుడు వారిని ఎలా ఫైనల్ చేయాలా అన్న విషయం లో సతమతమవుతున్నట్లుగా తెలుస్తుంది .ఈ దిశగా ఇటీవల జరిగిన గాంధీభవన్ మీటింగ్( Gandhi Bhavan ) హాట్ హాట్ గా జరిగినట్లు తెలుస్తోంది .
అభ్యర్థులు ఎంపికను ఏ ప్రాతిపదికతను చేస్తారని వారి బలాబలాలను ఏ విధంగా సర్వే చేస్తారంటూ నేతల మధ్యన వాగ్వాదాలు జరిగినట్లుగా తెలుస్తుంది.ఈ దిశగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) మధ్య చాలా హీట్ డిస్కషన్ నడిచినట్లుగా వార్తలు వస్తున్నాయి.
![Telugu Gandhi Bhavan, Rahul Gandhi, Revanth Reddy, Telangana-Telugu Political Ne Telugu Gandhi Bhavan, Rahul Gandhi, Revanth Reddy, Telangana-Telugu Political Ne](https://telugustop.com/wp-content/uploads/2023/08/Telangana-Congress-Gandhi-Bhavan-Revanth-Reddy-Telangana-politics.jpg)
అంతేకాకుండా బీసీలకు ఏ విధంగా న్యాయం చేస్తారని హనుమంతరావు ప్రశ్నించగా మహిళా అభ్యర్ధుల సంగతి ఏమిటంటూ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి ప్రశ్నించారట.అయితే ఇలా తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన నియోజక వర్గాలను తమ స్థాయిలో ఫైనల్ చేసి ఐదుగురి కి మించి అప్లికేషన్ లు వచ్చిన నియోజక వర్గాలను ఏ ఐ సి సి ఫైనల్ చేసే విధంగా తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది మూడంచల వ్యూహాన్ని అమలు చేయాలని, మొదటి దశలో సింగిల్ అప్లికేషన్లు వచ్చిన నియోజకవర్గాలను ఫైనల్ చేసి మొదటి లిస్టు రెడీ చేసి రెండవ లిస్టులో ఐదుకి మించి అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాలను ఏఏసిసితో ఇంటర్వ్యూ పద్ధతిలో ఫైనల్ చేయాలని అంతకుమించి అప్లికేషన్ లు ఉన్న నియోజకవర్గాలను మాత్రం ఆఖరి వరకూ హోల్డ్ చెయ్యాలని మిగతా పార్టీల అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత ఉన్న వాస్తవ పరిస్థితులను బేరిజు వేసుకొని చివరి క్షణంలో నిర్ణయం తీసుకోవాలని పిసిసి నిర్ణయించినట్లుగా తెలుస్తుంది.
![Telugu Gandhi Bhavan, Rahul Gandhi, Revanth Reddy, Telangana-Telugu Political Ne Telugu Gandhi Bhavan, Rahul Gandhi, Revanth Reddy, Telangana-Telugu Political Ne](https://telugustop.com/wp-content/uploads/2023/08/Telangana-Congress-Gandhi-Bhavan-Revanth-Reddy-Mallikarjun-Kharge-rahul-gandhi.jpg)
ఏది ఏమైనప్పటికీ ప్రజాస్వామ్య పద్ధతిలో దరఖాస్తులు ఆహ్వానించడం వరకు బాగానే ఉన్నప్పటికీ ఆశావాహులను ఫైనల్ చేయటం టికెట్ దక్కని వారిని ఊరడించడం కాంగ్రెస్కు కత్తి మీద సాము లానే కనిపిస్తుంది.