మహిళా రెజ్లర్ల గోడు ఎవరికి పట్టదా?

ఈ రోజుల్లో సాధారణ మహిళలకే కాదు అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన మహిళలకు కూడా న్యాయం అందని ద్రాక్షగా మారినట్లు కనిపిస్తుంది ….దేశం కోసం పథకాలు తీసుకొచ్చి, దేశానికి గర్వకారణంగా మారిన మహిళల పట్ల ఈ రకం గా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి .

 Why Govt Silent On Wrestlers Issue Details, Wfi, Women Wrestlers, Women Wrestler-TeluguStop.com

అయితే అధికారమే పరమావధిగా భావించే ప్రస్తుత పరిస్థితులలో వీరు ఆరోపణలు చేస్తున్నది ప్రస్తుత అధికార పార్టీ నేత అయినందున, నాలుగు నెలల నుంచి పోరాడుతున్నా కూడా కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయని విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది.

తమకు జరిగిన అన్యాయంపై జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగిన ఈ క్రీడాకారిణులు ( Women Wrestlers ) తమకు మద్దతు ఇవ్వమని సాటి క్రీడాకారులను కోరుతున్నారు .ఇప్పటివరకు మౌనంగా ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా వీరి పోరాటానికి మద్దతు ఇస్తున్నారు షూటింగ్లో గోల్డ్ మెడలిస్ట్ అయిన అభినవ్ బింద్రా( Abhinav Bindra ) వీరికి న్యాయం జరగాలంటూ ట్విటర్ వేదికగా మద్దతు ఇచ్చారు .జావలిన్ త్రో లో గోల్డ్ మెడలిస్ట్ అయిన నీరజ చోప్రా( Neeraj Chopra ) తాజాగా వీరి పోరాటానికి మద్దత్తు తెలియచేశాడు ….దేశం గర్వించదగిన క్రీడాకారిణులు గానే కాక దేశంలో ఏ మహిళ కైనా న్యాయం జరగాలని,

Telugu Abhinav Bindra, Brijbhushan, Jantar Mantar, Neeraj Chopra, Sakshi Malik,

ఇది సున్నితమైన విషయమైనందున నిష్పక్షపాతంగా విచారణ జరిగి దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నాను అంటూ ఆయన ట్విట్ చేశారు.టెన్నిస్ క్రీడాకారుని సానియా మీర్జా( Sania Mirja ) కూడా ఈ విషయంలో క్రీడాకారిణులు లకు మద్దతు ఇచ్చారు.ఒక క్రీడాకారినిగా కాక ఒక స్త్రీగా కూడా వారి పరిస్థితి చూస్తూ బాధపడుతున్నానని, వారు మెడల్స్ తెచ్చినప్పుడు చప్పట్లు కొట్టి ఆనందం వ్యక్తం చేశామని ఇప్పుడు వారి తరఫున నిలబడాల్సిన అవసరం వచ్చిందని .

Telugu Abhinav Bindra, Brijbhushan, Jantar Mantar, Neeraj Chopra, Sakshi Malik,

నిజా నిజాలు తొందరగా బయటకు వచ్చి వారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు.అయితే సాటి క్రీడాకారులకు అన్యాయం జరిగినప్పుడు ఒక్క క్రికెట్ క్రీడాకారుడు కూడా కనీసం చిన్న ట్వీట్ కూడా చేయకపోవడం పట్ల సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది.క్రికెట్ కమర్షియల్ క్రీడగా మారిపోయిందని వ్యక్తిగత స్వార్థం తప్ప సాటి క్రీడాకారుల పట్ల అభిమానం లేకుండా పోయిందని సోషల్ మీడియాలో అనేక రకాలుగా ట్వీట్స్ వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube