రాజన్న సిరిసిల్ల జిల్లా బివై.నగర్ లోని సిఐటియు కార్యాలయంలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ , జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ మే 1 వ.తేదీ సోమవారం రోజున కార్మిక హక్కుల పోరాట దినం ప్రపంచ కార్మిక దినోత్సవం 137 వ మేడే సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా లో కార్మిక వర్గ ఐక్యత చాటే విధంగా “మేడే” పోరాట అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తూ మే ఒకటవ తేదీ సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల కొత్త బస్టాండ్ నుండి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కార్మిక మహా ప్రదర్శన డీజే ర్యాలీ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ఇట్టి కార్యక్రమాలలో జిల్లాలోని కార్మిక వర్గ ప్రజలు కష్టజీవులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.
మే ఒకటో తేదీన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు బందుకు పిలుపునివ్వడం జరిగిందని సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న పవర్లూమ్ కార్మికులు, అనుబంధ రంగాల వార్పిన్ , వైపని , టెక్స్టైల్ పార్కు కార్మికులు జాఫర్లు, ఆసాములు అనుబంధ రంగాల కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి నాయకులు సిరిమల్ల సత్యం , నక్క దేవదాస్ , గుండు రమేష్ , శ్రీపతి మునిందర్ , ఓడ్నాల వీరేశం , బెజుగం సురేష్ , బింగి సంపత్ , సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.







