ఈ దసరా సందర్బంగా తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి హీరోగా, లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వచ్చిన సినిమా లియో( Leo ).ప్రస్తుతం ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోంది.
బేసిగ్గా తమిళ డైరెక్టర్ అయినా ఖైదీ, విక్రమ్ సినిమాల తరువాత దర్శకుడు లోకేశ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.అందుకే లియో సినిమాను ఇక్కడ భారీ స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
ఇక్కడ కూడా మంచి హిట్ టాక్ ను సంపాదించింది.అయితే ఈ సినిమా చూసినవారంతా ఇందులో ఉన్న సైకో గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్న పరిస్థితి.
లియో సినిమా ప్రారంభంలోనే సైకో కిల్లర్ లాగా ఓ కుర్రాడు కనిపిస్తుంటాడు.కొంచెం సేపు స్క్రీన్ మీద ఉన్నా.
తన నటనతో అందరినీ భయపెట్టేసాడు మరి.
ఈ క్రమంలోనే మనోడు ఎవరంటూ? అనేకమంది వెతకడం మొదలు పెట్టారు.అవును, ఈయన ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ కొరియోగ్రఫర్ శాండీ మాస్టర్( Sandy master ).ఈయన స్వతహాగా నటుడు కూడా.వెండితెర మీదనే కాదు బుల్లితెర మీద కూడా ఆయన నటించిన దాఖలాలు వున్నాయి.2005లో కలైంజర్ టీవీలో ప్రసారమైన డ్యాన్స్ షో మానాడ మయిలాడ సీజన్ 1 లో కొరియోగ్రాఫర్ గా తన ప్రయాణం మొదలుపెట్టారు.ఇదే షోలో మనోడు విజేతగా కూడా నిలిచారు.ఆ తర్వాత ఇదే షోలో వివిధ సీజన్ లలో న్యాయనిర్ణేతల ప్యానెల్ లో కూడా పనిచేశాడు శాండీ.
ఈ క్రమంలో 2019లో జరిగిన బిగ్ బాస్ తమిళ వర్షన్( Bigg Boss Tamil ) లో మనోడు కంటెస్టెంట్ గా పాల్గొని మాస్టర్ గా పాపులర్ అయ్యారు.ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాకు కొరియోగ్రఫీ అందిస్తూ.పనిలో పనిగా సినిమాల్లో నటించడం మొదలు పెట్టాడు.ఈ నేపధ్యంలో “ఇవనుకు తన్నిల గండం” అనే సినిమాతో తన కెరీర్ ను స్టార్ట్ చేశారు ఈ కొరియోగ్రఫర్.
ఎన్నో సినిమాల్లో కనిపించిన శాండీ లియో మూవీతో తన క్రేజ్ ను మరింత పెంచుకున్నాడు.ఈయన నటన చూసిన చాలా మంది ఆశ్యర్యపోయారు.ఆయన సైకో పాత్రలో ఒదిగిపోయారు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.ప్రస్తుతం ఈ కొరియో గ్రాఫర్ కి మరిన్ని సినిమా అవకాశాలు వస్తున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.