దూరంలో ఉన్న తమ బంధువులకు, కుటుంబ సభ్యులకు చాలా మంది గతంలో పోస్టు కార్డులు( Postcards ) రాసేవారు.ఇక ప్రస్తుతం పోస్టాఫీసులలో పని తక్కువ అయిపోయింది.
ఇప్పుడు అంతా పార్సిల్‌లు అందుబాటులోకి వచ్చాయి.చివరికి విదేశాలకు ఏదైనా పంపాలన్నా కొన్ని రోజుల్లో దేశంలో ఏమూలకు అయినా కేవలం ఒకటి, రెండు రోజుల్లో పార్సిల్ అయిపోతున్నాయి.
అలా పోస్టాఫీసులకు కొంత పనిభారం తగ్గింది.అయితే ఒకప్పుడు పోస్టాఫీసుల ద్వారా ఉత్తరాలు, ఇతర పార్సిళ్లతో పాటు ఆశ్చర్యకరంగా చిన్న పిల్లలను( Kids ) కూడా పార్సిల్ చేసేవారు.
వినడానికి ఆశ్చర్యంగా ఇది నిజం.పక్క ఊరిలో ఉన్న తమ బంధువుల వద్దకు లేదా కుటుంబ సభ్యుల వద్దకు పార్సిల్ ద్వారా చిన్న పిల్లలను పంపించే వారు.
దీని గురించి ఆశ్చర్యకర సంగతుల గురించి తెలుసుకుందాం.

యూరప్( Europe ) దేశాలలో గతంలో అధికంగా యూఎస్ మెయిల్ పోస్టుకార్డులు, ఇతర లెటర్లు ప్రజలు పంపుకునే వారు.అయితే 1913లో దీని ద్వారా పార్సిల్ సర్వీసులు కూడా అందుబాటులోకి వచ్చాయి.దీనిని ప్రజలు విరివిగా వినియోగించుకునే వారు.
ఇక రైలు ప్రయాణాలు అప్పట్లో చాలా ఖరీదుగా ఉండేవి.దీంతో పక్క ఊళ్లలో ఉన్న తమ వాళ్లకు పాలు, పండ్లు, బటర్, ఇతర నిత్యావసరాలు యూఎస్ మెయిల్( US Mail ) ద్వారా ప్రజలు పంపించుకునే వారు.
దీనిపై ఎంత నమ్మకం ఉందంటే.చివరికి తమ పిల్లలకు కేవలం స్టిక్కర్ అంటించి పక్క ఊళ్లకు పంపే వారు.
అక్కడ పిల్లల అమ్మమ్మ, తాతయ్య లేదా నానమ్మ వంటి బంధువులు వారిని రిసీవ్ చేసుకునే వారు.

కేవలం కొన్ని గంటల్లో పిల్లలను ఇలా పార్సిల్( Parcel ) ద్వారా పంపే వారు.ఇలా పిల్లలను పార్సిల్ ద్వారా పంపడం అధికారికం కాదు.అయినా చౌక ధరలకే పార్సిల్ సేవలు అందుబాటులో ఉండడంతో ప్రజలకు ఇది ఆమోద యోగ్యంగా ఉండేది.
ఇదే కోవలో ఓక్లహమాలో( Oklahoma ) ఉంటున్న ఓ మహిళ తన మనవడిని వెల్లింగ్టన్‌లో ఉంటున్న బాలుడి అత్త వద్దకు పార్సిల్‌లో పంపింది.మెడలో ట్యాగ్ వేసి రెడీగా ఉంచగానే, పోస్ట్ మ్యాన్ వచ్చి ఆ బాలుడిని తీసుకున్నాడు.
తర్వాత చేర్చాల్సిన ప్రాంతానికి ఆ పిల్లాడిని సురక్షితంగా చేర్చినట్లు న్యూయార్క్ టైమ్స్ ఇటీవల కథనం ప్రచురించింది.