వాట్సాప్‌ మల్టీ డివైస్‌ కనెక్టివిటీ ఫీచర్‌.. ఈ విధంగా పనిచేస్తుంది!

ప్రముఖ మెసేంజర్‌ యాప్‌ వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తుంది.అదే మల్టీ డివైజ్‌ కనెక్టివిటీ ఫీచర్‌.

 Whatsapp Rolling Out For Multi Device Connectivity., Whatt App , Multidivise Con-TeluguStop.com

దీంతో వాట్సాప్‌ వినియోగదారులు వారి మొబైల్‌ ద్వారా ఇతర నాలుగు డివైజ్‌లు యాక్సెస్‌ చేసే అవకాశం ఉంటుంది.వాట్సాప్‌ మెసేజ్‌లు కూడా ఇతర ల్యాప్‌టాప్, ట్యాబ్‌ వంటి దాదాపు నాలుగు డివైజ్‌ల ద్వారా చదివే అవకాశం ఉంటుంది.

అయితే, ఇక వారి ఫోన్లలో బ్యాటరీ అయిపోయినా ఇతర డివైజ్‌ల ద్వారా వాట్సాప్‌ యాక్సెస్‌ చేయవచ్చు.అంటే ఇక్కడ మీ ఫోన్‌ ప్రైమరీ డివైజ్‌గా పనిచేస్తుందన్నమాట.

ప్రస్తుతం వాట్సాప్‌ ఖాతా ఒకే నంబర్‌పై పనిచేస్తుంది.అంటే ల్యాప్‌టాప్‌ వర్క్‌ చేయలానుకున్నా కేవలం వాట్సాప్‌ వెబ్‌ ద్వారానే చేయాల్సి ఉంటుంది.అది కూడా ఫోన్‌ వాట్సాప్‌కు నెట్‌ ఉండి లింక్‌ అవుతునే ఇది పనిచేసేది.కానీ, ఈ నయా ఫీచర్‌తో ఆ పని ఉండబోదు.

వాట్సాప్‌ మల్టీ డివైజ్‌ సపోర్ట్‌ గురించి సంస్థ ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపింది.ప్రతి డివైజ్‌ మీ వాట్సాప్‌కు లింక్‌ అవుతుందని, అంతేకాదు ఉపయోగించే ఇతర అన్ని డివైజ్‌లకు కూడా వాట్సాప్‌ మాదిరిగా ప్రైవసీ, సెక్యూరిటీ ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌లాగానే ఉంటుందని వాట్సాప్‌ తెలిపింది.

దీన్ని రానున్న రోజుల్లో ఎనేబుల్‌ చేయడానికి వాట్సాప్‌ ఆర్కిటెక్చర్, డిజైన్‌పై పునఃరాలోచించాల్సిన అవసరముందని తెలిపింది.ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ను వాట్సాప్‌ న్యూ టెక్నాలజీలో భాగంగా అభివృద్ధి చేసింది.

దీంట్లో కాంటాక్ట్‌ నేమ్స్, చాట్‌ ఆర్చీవ్స్, స్టార్డ్‌ మెసేజెస్‌ డిౖ జ్‌ మొత్తానికి సింక్రనైజ్‌ అయి ఉంటాయి.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ కొన్ని బీటా ప్రోగ్రాంల ద్వారా పరీక్షించాలనుకుంటుంది.ఇప్పుడు అందరికీ అందుబాటులో లేదు.ఇక మరిన్నీ ఫీచర్లను కూడా వాట్సాప్‌కు జోడించదలచింది.

ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ బీటా యూజర్లకు అందుబాటులో ఉంటుందో లేదో? తెలపలేదు.ఈ ఫీచర్‌ ఇప్పటి వరకు ఏ సంస్థ తయారు చేయలేదు.

దీంతో ఇది ఇతర కంపెనీలకు ఇది ఓ సవాలు వంటిది.ఒకవేళ మీకు ఎవరైన మెసేజ్‌ పంపితే, మీరు దాన్ని చదవాలనుకుంటే ఇతర డివైజ్‌ యాక్సెస్‌ చేయకుండా డివైజ్‌ లిస్ట్‌ పేర్లు సర్వర్‌ ద్వారా అందుబాటులో ఉంటుంది.

త్వరలో వాట్సాప్‌ ఆటోమెటిక్‌ డివైజ్‌ వెరిఫికేషన్‌ టెక్నాలజీని కూడా డెవలప్‌ చేయనుంది.మొదట ఇతర డివైజ్‌లు కనెక్ట్‌ చేసేటపుడు అన్ని క్యూఆరో కోడ్‌ ద్వారా లింక్‌ చేయాల్సి ఉంటుంది.

కానీ, ఈ ఫీచర్‌ను లింక్‌ చేసే ముందు బయోమెట్రిక్‌ ఆథెంటికేషన్‌ కూడా అవసరమవుతుంది.కనెక్ట్‌ అయిన అన్ని డివైజ్‌లకు లాస్ట్‌ వాడిన హిస్టరీ కూడా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube