దిగ్గజ మెసేంజర్ యాప్ వాట్సాప్ వినియోగదారులకు ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు నయా ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంటుంది.ఈ నేపథ్యంలోనే ఓ కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.
ఇకపై వాట్సాప్‌లో హై రిసొల్యూషన్ వీడియోలను పంపొచ్చు.ఇటీవలె వాట్సాప్ ఫ్లాష్ కాల్స్, చాట్ బ్యాకప్, వ్యూ వన్స్ వంటి ఇతర కొత్త ఫీచర్లను కూడా పరిచయం చేసిన సంగతి తెలిసిందే! వాట్సాప్ కొత్తగా వాయిస్ మెసేజెస్‌ను కరెక్ట్ చేసుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
అంటే మనం వాయిస్ మెసేజ్ రికార్డు చేసి పంపే ముందు అది వినే అవకాశం లభిస్తుంది.ఇలా కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వాట్సాప్ తన యూజర్ల సంఖ్యను మరింతగా పెంచుకుంటుంది.
ఈ జాబితాలో ఇక హై రిసొల్యూషన్ వీడియో ఫీచర్‌ను కూడా పరిచయం చేస్తోంది.ఇది వరకు హై క్వాలిటీ వీడియోలను పంపించేటప్పుడు వాట్సాప్‌కు కొన్ని పరిమితులు ఉండేవి.
ఇకపై ఏదైనా వీడియో పంపే ముందు దాని క్వాలిటీని ఎంచుకునే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే కొన్ని ఈ టెక్నాలజీని వాడుతున్నాయి.
దీనికి ఆరీసీఎస్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయి.కానీ, వాట్సాప్ మాత్రం ఈ విషయంలో కాస్త వెనుకబడింది.
త్వరలో తన వినియోగదారులకు ఈ నయా ఫీచర్‌ను పరిచయం చేయనుంది.ప్రస్తుతం ఈ ఫీచర్ పరిశోధన దశలో ఉంది.
త్వరలో ఆండ్రాయిడ్, బీటా వినియోగదారులకు కూడా పరిచయం చేయనుంది.వాట్సాప్ యూజర్లు తమ కాంటాక్ట్స్‌కు వీడియో పంపే ముందు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.
మొదటి ఆప్షన్ ఆటో మోడ్.ఇది నిర్ధిష్ట వీడియోను ఆటోమేటిక్‌గా హై క్వాలిటీ వీడియోగా మారుస్తుంది.
రెండోది బెస్ట్ క్వాలిటీ.వినియోగదారు ఈ ఆప్షన్‌ను ఎంచుకోగానే వాట్సాప్ ఆ వీడియోను బెస్ట్ క్వాలిటీలోకి మారుస్తుంది.

మీరు తీసిన వీడియోను క్వాలిటీ తగ్గకుండా అలాగే రిసీవర్‌కు చేరుస్తుంది.మూడో ఆప్షన్ డేటా సేవర్.ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే వాట్సాప్ మీ వీడియోను కంప్రెస్ చేస్తుంది.ప్రస్తుతం, ఈ ఫీచర్లన్నీ టెస్టింగ్ దశలోనే ఉన్నాయని వాట్సాప్ బీటా ఇన్ఫో పేర్కొంది.కానీ, అతి త్వరలోనే ఈ ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది.