Deepti Sunayana : ఏంటి దీప్తి సునయన అతనితో లవ్ లో ఉందా.. ఒకసారి ఆ పని చేయమంటున్న నెటిజన్స్?

సోషల్ మీడియా స్టార్ దీప్తి సునయన( Deepti Sunayana ) గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు.ఎందుకంటే ఈమె తన పరిచయాన్ని పూర్తిగా పెంచేసుకుంది.

 What Is Deepti Sunayana In Love With Him Netizens Want To Do That Once-TeluguStop.com

పైగా తనకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.డబ్స్మాష్ వీడియోలతో అందరి దృష్టిలో పడిన దీప్తి సునయన మంచి ఫాలోయింగ్ పెంచుకుంది.

అలా యూట్యూబ్ లలో కూడా షార్ట్ ఫిలిమ్స్ చేసి మరింత గుర్తింపు తెచ్చుకుంది.దీంతో రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టి తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకుంది.

ఇక బిగ్ బాస్ తర్వాత కేవలం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమైంది దీప్తి.యూట్యూబ్ లలో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ, ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ బిజీగా మారింది.

అయితే ఈమె వ్యక్తిగతంగా కూడా బాగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.మరో యూట్యూబర్ షణ్ముఖ్ ( Shanmukh )ను లవ్ చేసి బ్రేకప్ చెప్పి అందరి దృష్టిలో పడింది.

ఇక బ్రేకప్ తర్వాత కూడా ఇంకా ఎనర్జీగా మారింది దీప్తి సునయన.ముఖ్యంగా సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.అప్పుడప్పుడు సెల్ఫీ వీడియోస్ కూడా బాగా పంచుకుంటూ ఉంటుంది.ఇక తను తీయించుకున్న ఫోటోషూట్లను కూడా బాగా షేర్ చేయించుకుంటుంది.అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ తో చిల్ చేస్తున్న ఫోటోలను, వీడియోలను.

వారితో కలిసి ట్రిప్స్ కెళ్ళిన ఫోటోలను బాగా పంచుకుంటూ ఉంటుంది.ఖాళీ సమయం దొరికితే తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు పెట్టేస్తూ ఉంటుంది.

ఇక ఇటీవలే తను కొత్త ఇల్లును కొనుగోలు చేయగా గృహప్రవేశం చేసి వాటి ఫోటోలను కూడా బాగా పంచుకుంది.

ఇక ఈమె ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు అది షణ్ముఖ్ ను ఉద్దేశించినట్లే అనిపిస్తూ ఉంటుంది.చాలావరకు షణ్ముఖ్ కు తగిలేలా పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది.పోస్టులను చూసిన వాళ్లంతా వెంటనే షన్ను ని ఉద్దేశించే ఇలా పోస్ట్ చేస్తుంది అని చాలామంది అనుకున్నారు.

అయితే ఇదంతా పక్కనే పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో పంచుకుంది.ఇటీవలే ఆమె ‘ఏమోనే’( Emone ) అనే వీడియో సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఆ వీడియోని యూట్యూబ్లో విడుదల చేయగా మున్నటివరకు ట్రెండులో ఉండేది.ఇక రోజు ఈ వీడియోకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పంచుకుంటూ ఉంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక ఎమోషనల్ స్టోరీ పంచుకుంది.అందులో తను ఇంగ్లీషులో ఏదో చెబుతూ బాగా కంటనీరు పెట్టుకొని కనిపించింది.

దీంతో ఆ వీడియో చూసి అందరూ షన్ను గుర్తుకు వస్తున్నాడా అని కామెంట్లు చేస్తున్నారు.అయితే ఓ నెటిజన్.

అవును దీపు నువ్వు విశాల్ షర్టు వేసుకున్నావు కదా.నువ్వు విశాల్ సంథింగ్ సంథింగా అంటూ అనుమానంతో అడిగారు.మరో నెటిజన్.ఒకసారి విశాల్ తో ఫోన్ చేసి మాట్లాడు అంటూ కామెంట్ చేశారు.ప్రస్తుతం ఆ కామెంట్లు బాగా వైరల్ అవుతున్నాయి.ఇంతకు విశాల్ ఎవరో కాదు.

తనతో పాటు ఏమోనే వీడియోలో చేసిన నటుడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube