కావాలని అలా చేయలేదు... క్షమాపణలు చెప్పిన కాలభైరవ!

రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం RRR.ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ (Oscar)అవార్డు రావడంతో ప్రపంచం మొత్తం ఈ సినిమా గురించి ఈ పాట గురించి చర్చలు జరుపుతున్నారు.

 He Didn't Do It On Purpose Kalabhairava Apologized ,ramcharan , Kalabhairava ,-TeluguStop.com

చంద్రబోస్ అందించిన ఈ అద్భుతమైన పాటకు కీరవాణి ( Keeravani )అద్భుతమైన స్వరాలను సమకూర్చగా రాహుల్ కాలభైరవ ఈ పాటను ఎంతో అద్భుతంగా పాడారు.ఇక ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ ఎన్టీఆర్ రామ్ చరణ్ డాన్స్ అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి.

ఇలా ఈ పాట ఇంత మంచి సక్సెస్ కావడంతో సింగర్ కాలభైరవ (Kalabhairava) ఈ సక్సెస్ పై సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.

ఇక ఈ పాట ఆస్కార్ అందుకోవడంతో ఆస్కార్ (Oscar) వేదికపై కూడా పాడిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ విషయంపై కాలభైరవ స్పందిస్తూ.RRR సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం అంత పెద్ద వేదికపై లైవ్ లో ఈ పాట పాడటం తనకు ఎంతో సంతోషం కలిగించిందని తెలిపారు.

ఇందుకు కారణమైనటువంటి రాజమౌళి గారికి నాన్న కీరవాణి, చంద్ర బోస్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, అమ్మ, పెద్దమ్మ, కార్తికేయ అన్నయ్య వీళ్లంతా ముఖ్య కారణం.వీరి వల్లే ఈ పాట ప్రపంచం నలుమూలలకు వెళ్లి అందరి చేత పాటకు స్టెప్పులు వేయించింది అంటూ ఈయన తన సంతోషాన్ని తెలియజేశారు.

ఈ విధంగా కాలభైరవ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎన్టీఆర్(NTR) రామ్ చరణ్ (Ramcharan) అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాలభైరవను ట్రోల్ చేస్తున్నారు.ఈ పాట సక్సెస్ కావడానికి మీ ఫ్యామిలీ ఒక్కటే కారణమా ఎన్టీఆర్, రామ్ చరణ్ డాన్స్ వేయకపోతే ఈ పాటకు ఇంత క్రేజ్ వచ్చేది కాదు, ఇలా ఈ సక్సెస్ కు కారణమైనటువంటి వారిలో ఎన్టీఆర్ రామ్ చరణ్ పేరును మర్చిపోవడంతో అభిమానులు భారీగా ట్రోల్ చేస్తున్నారు.అయితే తన గురించి వస్తున్నటువంటి ఈ ట్రోల్స్ పై కాలభైరవ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.తారక్, చరణ్ అన్న వల్ల ఈ పాట ఇంత సక్సెస్ అయిందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు.

నేను కేవలం అకాడమీ వేదికపై పాడటానికి సహకరించిన వారి పేర్లను మాత్రమే ప్రస్తావించాను కానీ ఇది మీకు వేరేలా అర్థమైంది.తాను ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పోస్ట్ చేయలేదని, తనని తప్పుగా భావించి ఉంటే క్షమించండి అంటూ ఈ పోస్టుపై వివరణ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube