మాస్ మహరాజ్ రవితేజ హీరోగా చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని అందుకున్నాయి ఏ క్యారెక్టర్ అయిన చాలా ఎనర్జిటిక్ గా చేస్తాడు రవితేజ.అలాంటి రవితేజ కెరియర్ మొదట్లో పూరి లాంటి స్టార్ డైరెక్టర్ తో వరుసగా హ్యాట్రిక్ హిట్లు కొట్టిన విషయం మనందరికీ తెలిసిందే.
అయితే పూరి ఆయన తీసిన సినిమాలతో రవితేజ ని ఫుల్ టైం హీరో గా మార్చాడు.రవితేజ అంటే మినిమం గ్యారంటీ సినిమాలు తీస్తాడు అనే ఒక మంచి పేరు ఉంది.
ఇక ఇది ఇలా ఉంటే కెరియర్ మొదట్లో వేరే హీరోలు చేయాల్సిన సినిమాలు చేసి సక్సస్ లు సాధించిన రవితేజకి రెండు సినిమాల విషయం లో మాత్రం అన్యాయం జరిగిందనే చెప్పాలి ఆ సినిమాలు ఏంటంటే టెంపర్, పటాస్ ఈ రెండు సినిమాలు రవితేజనే చేయాలి.
మొదట గా ఈ రెండు కథలు రవితేజ దగ్గరికే వచ్చాయి ఒక సినిమా చేస్తున్న అని ఇంకో సినిమాని మిస్ చేసుకొని చివరికి ఆ రెండు సినిమాల్లో ఒక్క సినిమా కూడా చేయకుండా రెండు సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది.
ఇక విషయంలోకి వెళ్తే టెంపర్ కథ వక్కంతం వంశీ ది కావడం వల్ల వంశి మొదటగా మెహర్ రమేష్ కి ఈ కథ చెప్పాడు దాంతో మెహర్ రమేష్ ఈ కథ నాకు కావాలి రవితేజ తో నేను ఈ సినిమా చేస్తాను అని కథ తీసుకెళ్ళి కొన్ని మార్పులు చేసి రవితేజ కి చెప్పాడు.

కథ నచ్చింది సినిమా కూడా చేద్దాం అనుకున్న టైమ్ లో ఈ కథ లాగే ఉండే పటాస్ సినిమా కథ ని డైరెక్టర్ అనిల్ రావిపూడి రవితేజ కి చెప్తే రీసెంట్ గా విన్న ఆ స్టోరీ ఈ స్టోరీ ఒకేలా ఉన్నాయి.కాబట్టి నేను దానికి కమిట్ అయ్యాను ఇక ఇది చేయలేను అని చెప్పాడట దాంతో అనిల్, కళ్యాణ్ రామ్ కి కథ చెప్పి ఒప్పించి ఈ సినిమా చేశాడు.

అయితే ఎన్టీయార్ పూరి కాంబో లో చాలా రోజుల నుంచి సినిమా చేయాలి అనుకున్నారు.కానీ కథ సెట్ అవ్వక పొగ వక్కంతం వంశీ ని ఎన్టీయార్ పిలిచి టెంపర్ కథ ఇవ్వమని అడగ్గా రవితేజ పర్మిషన్ తీసుకొని వంశీ ఈ కథని పూరి కి ఇచ్చాడు మంచి స్టోరీ కావడం తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయన్ని అందుకుంది.అలా రవితేజ రెండు సినిమాలని మిస్ చేసుకున్నాడు ఈ రెండు సినిమాల్లో కనీసం ఒక్క సినిమా అయిన రవితేజ చేసి ఉంటే రవితేజ క్రేజ్ ఇంకా పెరిగి ఉండేదని అందరూ అభిప్రాయ పడుతున్నారు.