టాలివుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలకృష్ణ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు.
ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.ఇక ఇటీవల అఖండ, వీరసింహరెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు.
ఇలా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండటమే కాకుండా అన్ స్టాపబుల్ షో లో హోస్ట్ గా వ్యవహరిస్తూ మంచి గుర్తింపు పొందాడు.బాలయ్య హోస్ట్ చేసిన ఈ షో అన్ని రియాలిటీ షోలలో నెంబర్ వన్ గా కొనసాగుతోంది.
ఇక ఇటీవల అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ప్రారంభించారు.ఈ సీజన్ 2 కూడా సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది.ఇదిలా ఉండగా ఇన్నేళ్ల తన సినీ జీవితంలో కమర్షిల్ యాడ్స్ కి దూరంగా ఉన్న బాలకృష్ణ ఇప్పుడు తన రూటు మార్చుకున్నాడు.అందరి హీరోల లాగే సినిమాలలో నటిస్తూ కమర్షియల్ యాడ్స్ చేయటానికి సిద్దమయ్యాడు.
ఇప్పటికే ఒక యాడ్ లో నటించిన బాలకృష్ణ ఇక ఇప్పుడు మరొక యాడ్ లో నటించటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.బాలయ్య హీరోగా కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టేసాడు.
ఇక రీసెంట్‌గా ఇపుడు కమర్షియల్ యాడ్స్‌లో కూడా ఎంట్రీ ఇచ్చి అదుర్స్ అనిపిస్తున్నారు.
ఇక ఇటీవల బాలయ్య ఫస్ట్ కమర్షియల్ యాడ్‌కు సంబంధించిన ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే.ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఎన్నడు ఏ కమర్షియల్ యాడ్ చేయని బాలయ్య ఇపుడు బ్రాండింగ్‌లో రంగం లో దిగడం నిజంగా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అనే చెప్పాలి.ఇటీవల సాయి ప్రియ కనస్ట్రక్షన్స్‌కు సంబంధించిన 116 Praramount కు బాలయ్య ప్రకటన చేసారు.
ఇక తాజాగా వేగ జ్యువెలర్స్‌కు కి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.తాజాగా ఈ యాడ్ కి సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు.