కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన అసంతృప్త నేతలను బీఆర్ఎస్ ఆకర్షిస్తోంది.ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి నివాసానికి మంత్రి హరీశ్ రావు వెళ్లారు.
ఈ మేరకు విష్ణును బీఆర్ఎస్ లోకి చేరాలని మంత్రి హరీశ్ రావు ఆహ్వానించారు.జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానంపై విష్ణు వర్ధన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ విష్ణువర్ధన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందన్నారు.విష్ణును బీఆర్ఎస్ లోకి ఆహ్వానించామన్న మంత్రి హరీశ్ రావు ఆయన కూడా సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు.
తెలంగాణ అంశాలపై విష్ణు పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.ఈ క్రమంలోనే విష్ణువర్ధన్ రెడ్డికి తగిన న్యాయం చేస్తామని మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు.