విజయవాడ కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ దంపతులు ప్రారంబించారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు గవర్నర్ కు ఆలయ మర్యాదలతో మంత్రి దేవాదయ శాఖ అధికారులు స్వాగతం పలికారు అమ్మవారి దర్శనం అనంతరం .
దసరా మొదటి రోజు కనకదుర్గమ్మ దర్శనం ఎంతో ఆనందకరమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు దుర్గే దుర్గతి నాశని.
అంటూ అమ్మవారిని ప్రార్ధించానని రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని కోరుకున్నానన్నారు .కరోనా ను ప్రపంచం నుంచీ దూరం చేయాలని అమ్మవారిని కోరుకున్నాని అమ్మవారి దర్శనంతో కరోనా తొలగిపోవాలని ఆకాంక్షిస్తున్నాట్లు తెలిపారు