ఈ వేడికి ఎక్కడ ఉన్న పాములు అన్ని కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్న సంగతి తెలిసిందే.ఈ మధ్యకాలంలో పాములకు సంబంధించిన వార్తలు కూడా రోజు చూస్తూనే ఉన్నాం.
ఇంకా ఈ నేపథ్యంలోనే తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లాలోని తొండముత్తూర్ తాలూకా నరసిపురం గ్రామంలో ఏకంగా 15 అడుగుల కింగ్ కోబ్రా కనిపించింది.
ఇంకా ఈ పాము పొలం దగ్గరున్న ఒక గుడిసెలో దూరడంతో అది గమనించిన ఓ రైతు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
దీంతో సమాచారం అందుకున్న అడవి సిబ్బంది ఆ పాము కనిపించిన ఘటన స్థలానికి చేరుకున్నాడు.ఇంకా వెంటనే ఆ పామును ఓ సంచిలో బంధించారు.అయితే ఇక్కడే ఇంకొక ఆశ్చర్యమైన విషయం వెలుగులోకి వచ్చింది.
అది ఏంటి అంటే ? ఆ పాము ఒకటి, రెండు అడుగులు కాదు ఏకంగా పదిహేను అడుగుల పొడవు ఉంది.ఈ విషయం తెలుసుకున్న అటవీ సిబ్బంది సైతం ఆశ్చర్యపోయారు.అంత భారీ సైజు కింగ్ కోబ్రాలు చాలా అరుదుగా కనిపిస్తాయని అటవీశాఖ అధికారులు చెప్పారు.ఆ పామును పట్టుకున్న అధికారులు సిరువాని అడవి ప్రాంతంలో వదిలేశారు.అయితే ఆ పాముకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.