మళ్ళీ మొదలైన ట్రోల్స్.. ఉపాసన అలా అన్నదంటూ ఫైర్..

ఉపాసన కొణిదెల. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు.

 Upasana Gets Trolled For Her Beliefs Details, Upasana, Trolled, Ram Charan, Upas-TeluguStop.com

మెగా కోడలుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా ఈమె అందరికి సుపరిచితమే.ఉపాసన ప్రస్తుతం అపోలో హాస్పిటల్ ఛైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే సమాజంలో చైతన్యం కలిగించే విషయాలు కూడా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఎప్పటికప్పుడు తెల్పుతూ ప్రజలకు దగ్గరగా ఉంటుంది.

అయితే ఎప్పుడు పాజిటివ్ గా స్పందించే నెటిజెన్స్ ఈసారి మాత్రం ఉపాసన పై ఫైర్ అవుతున్నారు.ఎప్పుడు మంచి మంచి పోస్ట్ లు చేస్తూ తెలుగు ప్రజల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించు కున్న ఉపాసన ఈసారి మాత్రం నెటిజెన్స్ ఆమెకు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.

ఈమె ఎప్పుడో మాట్లాడిన పాత వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.ఈ వీడియోలో ఉపాసన చెప్పిన విషయం విని ఈమెను ట్రోల్ చేస్తున్నారు.

ఈమె ఈ వీడియోలో మాట్లాడుతూ.”మందులు తీసుకునే ముందు మహా మృత్యుంజయ మంత్రాన్ని రెండు సార్లు జరిపిస్తే అది బాగా పనిచేస్తుందని పురాణాలూ చెబుతున్నాయి.నేను దాని గురించి ఇటీవల చదివాను” అని చెప్పుకొచ్చింది.

Telugu Ram Charan, Trolled, Upasana, Upasana Beliefs, Upasanatrolled-Movie

ఈ వ్యాక్యలను కొంతమంది సమర్ధిస్తే మరికొంత మంది మాత్రం ఈమెను త్రో చేస్తున్నారు.అత్యుత్తమ పదవిలో ఉండి ఇలాంటి మూఢనమ్మకాలను ప్రచారం చేయడం ఏంటని ట్రోల్ చేస్తున్నారు.

అయితే మరికొంత మంది మాత్రం ఉపాసన కేవలం త్వరగా కోలుకునేందుకు కీలకమైన సానుకూలత స్వీయ విశ్వాసం గురించి మాత్రమే చెబుతుంది.

ఇలా చెప్పడం మూఢనమ్మకాలను ప్రోత్సహించడం కాదు.దాని గురించి ఇప్పుడే చదివాను అని ఆమె చెప్పింది.ఆమె ఈ మంత్రాన్ని ఉపయోగించమని ఎవ్వరికి చెప్పలేదు.అంటూ ఆమెకు సపోర్ట్ ఇస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube