అలనాటి పాత సినిమాల్లో కమెడియన్స్ జోడి కట్టడం అనేది బాగా క్రేజీ కాంబినేషన్.రమాప్రభ, రాజబాబు జోడి కి బాగా క్రేజ్ ఉండేది అలాగే వీరితో పాటు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న మరొక కమెడియన్స్ జంట గీతాంజలి మరియు పద్మనాభం.
వందకు పైకా సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు.అయితే గీతాంజలి మరియు పద్మనాభం ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో వీరి కాంబినేషన్ పై అనేక రూమర్స్ వచ్చేవి.
అలాగే వీరిద్దరూ సినిమాలో ఉండాలని దర్శక, నిర్మాతలు పట్టు పట్టి నటించేవారు దాంతో ఏకంగా దశాబ్దం పాటు వీరి కాంబినేషన్ లేకుండా సినిమాలు వచ్చేవి కాదు.ఇక మీడియా కూడా వీరిద్దరిపై అనేక వార్తలు వండి వడ్డించేవారు.
దానికి తోడు వీరిద్దరూ కలిసి అప్పట్లో ఒకే కారులో ఎక్కువగా ప్రయాణం చేసేవారట.అలా వీరి జంటపై వస్తున్న వార్తలకు బలం చేకూరినట్టుగా అయ్యేది.
షూటింగ్ కోసం కలిసి రావడం, కలిసిపోవడం వల్ల అనేకసార్లు మీడియా కంట కూడా పడేవారు.నిజానికి పద్మనాభం చాలా చదువుకున్న వ్యక్తి ఇలాంటి వార్తలను ఏమాత్రం లెక్క చేసేవారు కాదు.గీతాంజలి అయితే చాలా డేరింగ్ అండ్ డాషింగ్ దాంతో వారిపై వచ్చే వార్తలు విషయంలో చాలా టేక్ ఇట్ ఈజీ గా ఉండేది.గీతాంజలి పద్మనాభం ఈ వార్తలకు స్పందించకపోయినా వీరి బంధం గురించి తెలిసిన వారు వీటికి అడ్డుకట్ట వేయాలని భావించేవారు.
జెమిని వాహిని వంటి స్టూడియోలు గీతాంజలి పద్మనాభం పై వచ్చే వార్తలను కొట్టి పారేసేవారు వారి వ్యక్తిగత జీవితాల్లో దూరిపోయి వారి జీవితాలను నాశనం చేయడానికి మీడియాకు ఎలాంటి రైట్ లేదని ఇలాంటి వార్తలు వస్తే ఊరుకోమంటూ ప్రెస్ మీట్స్ పెట్టి మరీ చెప్పేవారు.ఆ తర్వాత పద్మనాభం తన సొంత సినిమాలో నిర్మించడం మొదలుపెట్టిన అన్నిట్లో గీతాంజలికి వరుస అవకాశాలు ఇచ్చేవారు.ఇలా విషయం లేకపోయినా ఆ వీరిద్దరి బంధం గురించి అప్పట్లో ఘాటుగా వార్తలు సాగాయి.